News December 26, 2025
HYD: బల్దియా ‘వసూళ్ల’ వేట.. సామాన్యుడికి వాత!

నగరవాసులపై పన్నుల భారాన్ని మోపేందుకు GHMC సిద్ధమైంది. డీలిమిటేషన్ సాకుతో ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా అధికారులు వసూళ్ల వేట ప్రారంభించారు. పాత, కొత్త సర్కిళ్లలో కలిపి రోజువారీగా రూ.7కోట్ల మేర పన్నులు రాబట్టాలని ఉన్నతాధికారులు హుకుం జారీ చేశారు. నెలకు సుమారు రూ.210కోట్లు ప్రజల నుంచి వసూలు చేయనున్నారు. మౌలిక వసతుల కల్పనను గాలికొదిలేసి, కేవలం పన్నుల వసూళ్లపైనే ప్రతాపం చూపడంపై ప్రజలు మండిపడుతున్నారు.
Similar News
News December 27, 2025
21,033 మంది శక్తి యాప్ డౌన్‌లోడ్: ఎస్పీ

కర్నూలు జిల్లాలోని విద్యాసంస్థల్లో మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై శక్తి టీమ్‌లు విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శక్తి యాప్, డయల్ 112, 1930 వంటి సేవల వినియోగంపై విద్యార్థినులకు వివరించామన్నారు. జనవరి నుంచి డిసెంబర్ 27 వరకు జిల్లాలో 21,033 మంది శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని ఎస్పీ పేర్కొన్నారు.
News December 27, 2025
మెదక్: ‘అర్హులైన అందరికీ అక్రెడిటేషన్స్ ఇవ్వాలి’

అర్హులైన జర్నలిస్టులకు అందరికీ అక్రెడిటేషన్స్ ఇవ్వాలని టీయూడబ్ల్యూజే (హెచ్- 143) యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం జర్నలిస్టులు మెదక్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం డీఆర్వో భుజంగ రావుకు వినతిపత్రం సమర్పించారు. జోవో నంబర్ 252 పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని టీయూడబ్ల్యూజే (హెచ్ 143) ఉమ్మడి మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షుడు జానకిరామ్ గౌడ్, జిల్లా కన్వీనర్ సురేందర్ రెడ్డి విమర్శించారు.
News December 27, 2025
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన: విజయనగరం కలెక్టర్

జిల్లాలో పారిశ్రామిక వృద్ధికి ఔత్సాహికులకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. విజయనగరంలోని కలెక్టరేట్‌లో DIEPC సమావేశాన్ని శనివారం నిర్వహించారు. జిల్లాలో కొత్తగా ప్రతిపాదించిన 8 పరిశ్రమల ద్వారా సుమారు 54 వేల మందికి ఉపాధి కలగనుందని తెలిపారు. దరఖాస్తులను సింగిల్ విండో విధానంలో వేగంగా పరిశీలించి అనుమతులు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు.


