News March 28, 2025

HYD: బస్టాప్ ఎక్కడుందో తెలుసుకోవడం ఈజీ..!

image

ఆర్టీసీ బస్టాప్‌ మీ దగ్గరలో ఎక్కడుందో తెలుసుకోవడం ఇక చాలా ఈజీ. HYD పట్టణానికి కొత్తగా వచ్చిన ఎంతో మందికి ఈ ప్రాంతం తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి RTC గుడ్ న్యూస్ తెలిపింది.TGSRTC గమ్యం యాప్ ఓపెన్ చేసి ‘బస్ స్టాప్ నియర్ మీ’ అనే ఆప్షన్ ఎంచుకుంటే, ఫొటోలో చూపిన విధంగా మీ దగ్గరలో బస్టాప్ ఎక్కడుందో చూపిస్తుంది. లొకేషన్ పట్టుకుని వెళ్తే సరిపోతుంది. ఫోటోలోనిది ఉప్పల్ చర్చ్ బస్‌స్టాప్.

Similar News

News November 4, 2025

ASF: మహిళల భద్రతకు షీ టీమ్స్: ఎస్పీ కాంతిలాల్ పాటిల్

image

ఆసిఫాబాద్ జిల్లాలో మహిళలు, యువతుల భద్రత కోసమే షీ టీమ్స్ పనిచేస్తున్నాయని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. హింసకు గురైతే నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని ఆయన సూచించారు. అక్టోబర్ నెలలో షీ టీమ్స్ ద్వారా 87 హాట్‌స్పాట్‌లను గుర్తించి, 22 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ క్రమంలో 16 మంది అకతాయిలను పట్టుకుని, ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.

News November 4, 2025

మంచిర్యాల: మత్స్యకారుల సంక్షేమం దిశగా చేప పిల్లల పంపిణీ

image

రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య,పాడి పరిశ్రమల,క్రీడా యువజన శాఖ మంత్రి శ్రీహరి అన్నారు. Hyd నుంచి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ..223.93లక్షల చేప పిల్లల పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.

News November 4, 2025

పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 105 పిటిషన్లు: ఎస్పీ

image

అనంతపురం ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 105 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పిర్యాదు దారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.