News January 14, 2025
HYD: బస్ స్టేషన్లలో ఇదీ పరిస్థితి..!

HYDలోని గచ్చిబౌలి, జేబీఎస్, ఉప్పల్ ప్రాంతాల్లో ఇప్పటికీ పలువురు గ్రామాలకు వెళ్తున్నారు. నేడు సంక్రాంతి పండుగ నేపథ్యంలో కొంత మంది నేడు ఉదయం ప్రయాణాలు మొదలుపెట్టారు. దీంతో బస్ స్టేషన్లలో కొద్దిమేర రద్దీ నొలకొంది. నేడు ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు అమలులో ఉండదని అధికారులు తెలిపారు. సాధారణంగా ఉండే బస్సుల్లోనే తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News February 16, 2026
BREAKING: కడ్తాల్ వద్ద రెండు కార్లు ఢీ.. ఇద్దరి దుర్మరణం

కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్కల్ పహాడ్ గేట్ సమీపంలో ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. NH 765పై రెండు కార్లు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కార్లలో ప్రయాణిస్తున్న నరేంద్ర చారి (37), ఎస్‌కే సైదులు (30) అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 13, 2026
BREAKING: రంగారెడ్డిలో హోరాహోరి.. ఫలితాలు ఇవే!

రంగారెడ్డిలోని 6 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, BRS హోరాహోరీగా నిలిచాయి. మొత్తం 6 మున్సిపాలిటీల్లో 126 వార్డులు ఉండగా 54 కాంగ్రెస్, 47 బీఆర్ఎస్, 16 బీజేపీ, 9 మంది ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఆమన్‌గల్ BRS, ఇబ్రహీంపట్నం BRS, షాద్‌నగర్ INC, శంకర్‌పల్లి INC, చేవెళ్లలో INC సత్తాచాటాయి. మొయినాబాద్ ఒక్క చోట హంగ్ ఏర్పడింది. అటు మేడ్చల్‌లోని అలియాబాద్ మున్సిపాలిటీలోనూ హంగ్ వచ్చింది.