News February 2, 2025
HYD: బార్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌రోడ్ నెంబర్ 36లోని పొష్ణోష్ లౌంజ్ బార్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ లైసెన్స్ ముగిసినా బార్ నడుపుతున్నారని వారు చెప్పారు. వంటల్లో గడువు ముగిసిన పెప్పర్స్, ఆయిల్ వాడుతున్నారని వాటిని సీజ్ చేసినట్లు చెప్పారు.
Similar News
News March 11, 2025
HYD: ఆరోగ్య సేవలకు ప్రత్యేక యాప్: MD

ఖైరతాబాద్ జలమండలి కార్యాలయంలో సోమవారం సత్వర ఆరోగ్య సేవలకు ప్రత్యేక యాప్ ను ఎండీ అశోక్ రెడ్డి ప్రారంభించారు. జలమండలి ఉద్యోగుల ఆరోగ్య సేవల కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు చెప్పారు. మెడ్ ఫ్లాష్ అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా రూ.3 లక్షల వరకు ఉచిత సేవలను పొందవచ్చన్నారు.
News March 11, 2025
HYD: సైబర్ క్రైం.. రూ.36 లక్షలు ఇప్పించారు

హైదరాబాద్‌లో రిటైర్డ్ ఉద్యోగిపై డిజిటల్ అరెస్ట్ సైబర్ నేరగాళ్లు జరిపారు. ఫెడక్స్ కొరియర్ డ్రగ్స్ పేరుతో 43లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా బదిలీ చేయించుకున్నారు. బాధితుడు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బాధితుడు డబ్బును ఫ్రీజ్ చేసి 36లక్షల రూపాయలను బాధితుడికి డీడీ ద్వారా సైబర్ క్రైమ్ డీసీపీ కవిత అందజేశారు.
News March 11, 2025
HYD: హైడ్రా ప్రజావాణికి వినతులు వెల్లువ

హైడ్రా సోమవారం ప్రజావాణిని నిర్వహించింది. ప్రజావాణికి మొత్తం 63 ఫిర్యాదులందాయని అధికారులు తెలిపారు. పాత లేఔట్లు, రహదారులు, పార్కులు ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయని వాటిని కాపాడాలని పలువురు వినతులు అందజేశారు. మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కబ్జా చేస్తున్నారని వారిపై ఫిర్యాదు చేసినా స్థానిక అధికారుల నుంచి స్పందన లేదని పలువురు వాపోయారు.