News March 24, 2024
HYD: బాలానగర్‌లో యువకుడి దారుణ హత్య

ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన HYD బాలానగర్ PS పరిధిలో ఈరోజు జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలానగర్ పరిధి APHB కాలనీలోని ఖాళీ ప్రదేశంలో ఉన్న ఓ బస్సులో స్థానికంగా నివాసం ఉండే పులి ప్రణీత్ తేజ అనే యువకుడిని అతడి స్నేహితుడే మద్యం మత్తులో నమ్మించి చంపేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 1, 2025
HYD: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపుల కలకలం

HYD శంషాబాద్ విమానాశ్రయంలో ఈరోజు బాంబు బెదిరింపు ఈ మెయిల్ కలకలం రేపింది. ఇండిగో ఫ్లైట్-68 ల్యాండింగ్ ఆపాలని హెచ్చరిక అందడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. విమానంలో IED, నర్వ్ గ్యాస్ ఉండొచ్చని అనుమానంపై BTAC అత్యవసర సమావేశం జరిగింది. ఫ్లైట్‌ను ముంబై ఎయిర్‌పోర్టుకు మళ్లించే నిర్ణయం తీసుకున్నారు. GMR సెక్యూరిటీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, భద్రతా విభాగాలు మెయిల్‌ను పరిశీలిస్తున్నాయి.
News November 1, 2025
HYD: ‘రంగనాథ్ సార్.. పాఠశాలకు వెళ్లలేకపోతున్నాం’

HYD శంషాబాద్ మండలం చిన్నగోల్కొండ, పెద్ద గోల్కొండ ఔటర్ రింగురోడ్డు అండర్ పాస్‌లు వరద నీటిలో మునుగుతున్నాయని విద్యార్థినులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బస్సులో తాము స్కూల్‌కు వెళ్తామని.. ఇటీవల తాము ప్రయాణిస్తున్న బస్సు అండర్‌పాస్ కింద నీటిలో ఆగిపోవడంతో ఇబ్బంది పడ్డామని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.
News November 1, 2025
BREAKING: HYD: ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై మహిళపై అత్యాచారం

HYD అమీర్‌పేట్ పరిధిలో ఈరోజు దారుణం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆస్పత్రి సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై GHMC పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం జరిగింది. బాధితురాలు ఏడుస్తూ బోరబండ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


