News July 19, 2024

HYD: బాలికపై ఏడాదిగా అత్యాచారం

image

ప్రేమ పేరుతో 14ఏళ్ల బాలికను లోబర్చుకుని ఏడాదిగా హత్యాచారం చేసిన ఘటన HYD మీర్‌పేట్‌లో జరిగింది. పోలీసుల కథనం.. బీహార్‌కు చెందిన కుటుంబం స్థానికంగా టిఫిన్ సెంటర్ నడుపుతోంది. పాన్‌షాప్ నిర్వాహించే రాకేశ్ ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరయ్యాడు. ఏడాదిగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈక్రమంలో తాను గర్భం దాల్చిన విషయం తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News December 26, 2025

HYDలో తొలిసారిగా రిమోట్ కంట్రోల్డ్ రూఫ్!

image

పాతబస్తీలోని అలావా-ఏ-బీబీ వద్ద దేశంలోనే అరుదైన, సిటీలో మొట్టమొదటి ‘రిమోట్ కంట్రోల్డ్ రిట్రాక్టబుల్ రూఫ్’ రాబోతోంది. సుమారు రూ.1.20 కోట్లతో GHMC ఈ భారీ ప్రాజెక్టును చేపట్టనుంది. మొహర్రం వేడుకలప్పుడు ఎండ, వానల వల్ల భక్తులు పడే ఇబ్బందులకు ఇక చెక్ పడనుంది. ఒకే ఒక్క రిమోట్ బటన్‌తో 4,844 చదరపు అడుగుల భారీ పైకప్పు క్షణాల్లో తెరుచుకుంటుంది లేదా మూసుకుంటుంది. సిటీలో ఇలాంటి ప్రయోగం జరగడం ఇదే తొలిసారి.

News December 26, 2025

HYD: బల్దియా ‘వసూళ్ల’ వేట.. సామాన్యుడికి వాత!

image

నగరవాసులపై పన్నుల భారాన్ని మోపేందుకు GHMC సిద్ధమైంది. డీలిమిటేషన్‌ సాకుతో ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా అధికారులు వసూళ్ల వేట ప్రారంభించారు. పాత, కొత్త సర్కిళ్లలో కలిపి రోజువారీగా రూ.7కోట్ల మేర పన్నులు రాబట్టాలని ఉన్నతాధికారులు హుకుం జారీ చేశారు. నెలకు సుమారు రూ.210కోట్లు ప్రజల నుంచి వసూలు చేయనున్నారు. మౌలిక వసతుల కల్పనను గాలికొదిలేసి, కేవలం పన్నుల వసూళ్లపైనే ప్రతాపం చూపడంపై ప్రజలు మండిపడుతున్నారు.

News December 26, 2025

HYD: మహానగరంలో 311 గ్రామాలు..!

image

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పునర్విభజన నోటిఫికేషన్ రావడంతో గ్రేటర్ స్వరూపమే మారిపోయింది. శివారు గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు GHMCలో కలవడంతో 2053 చదరపు కి.మీ విస్తీర్ణం పెరిగింది. ఇపుడు మహానగరంలో 311 గ్రామాలు, 47 మండలాలు, ఐదు జిల్లాలు భాగమయ్యాయి. ఆరు పార్లమెంటు స్థానాలు ఉండగా 28 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.