News February 9, 2025
HYD: బాలికపై లైంగిక దాడి కేసులో సంచలన విషయాలు!

నార్సింగి PS పరిధిలో బాలికపై అత్యాచారం జరిగిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికను మధుసూదన్, జయంత్, సాయి, తరుణ్ అత్యాచారం చేసి ఇంట్లో నుంచి డబ్బు, బంగారం తెచ్చి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆమె రూ.10వేలు వారికి ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడీగా ఉంటున్న బాలికను తల్లి నిలదీయగా జరిగిన విషయం చెప్పింది. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా నలుగురిని శుక్రవారం రిమాండ్ చేశారు.
Similar News
News November 3, 2025
VKB: తండ్రికి టాటా చెప్పి.. మృత్యువు ఒడికి

చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తాండూరు మండలంలోని ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. గౌతాపూర్ గ్రామానికి చెందిన చాంద్ పాషా కూతురు ముస్కాన్ (21) హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఆదివారం సెలవులో ఇంటికి వచ్చిన ఆమె, సోమవారం ఉదయం తాండూరు ఆర్టీసీ బస్సులో హైదరాబాద్‌కు బయల్దేరింది. బస్సు ఎక్కించే తండ్రికి “టాటా” చెప్పి వెళ్లిన ముస్కాన్ ప్రమాదంలో దుర్మరణం చెందింది.
News November 3, 2025
HYD: మృతులకు రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియా: మంత్రి

చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన బస్సు ప్రమాదం దురదృష్టకరమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.7 లక్షలు ప్రకటిస్తూ, బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే CM రేవంత్ రెడ్డి స్పందించి మంత్రులు, అధికారులను అప్రమత్తం చేశారని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్, RR జిల్లా కలెక్టర్ C.నారాయణ రెడ్డి ప్రమాద స్థలానికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించారు.
News November 3, 2025
మీర్జాగూడ యాక్సిడెంట్.. 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

బస్సు ప్రమాద ఘటనలో 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. ఉస్మానియా ఆస్పత్రికి చెందిన 12 మంది వైద్యుల బృందం పోస్టుమార్టం చేశారు. 18 మృతదేహాలను వారి కుటుంబాలకు డాక్టర్లకు అప్పగించారు. టిప్పర్ డ్రైవర్ ఆకాశ్ కాంబ్లీ మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించి, అంబులెన్స్‌లో నాందేడ్‌కు తరలించారు.


