News November 20, 2025
HYD: బాలుడి ప్రాణం తీసిన లిఫ్ట్.. తల్లిదండ్రులారా మీ పిల్లలు జాగ్రత్త!

HYD అమీర్‌పేట్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి <<18334439>>ఎల్లారెడ్డిగూడలో<<>> గల కీర్తి అపార్ట్‌మెంట్స్‌లో ఐదేళ్ల బాలుడు హర్షవర్ధన్ లిఫ్టులో ఇరుక్కుని మృతిచెందిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలుడు లిఫ్టులో ఉన్న సమయంలో 4వ, 5వ అంతస్తుల మధ్య ఇరుక్కుపోయాడు. అపార్ట్‌మెంట్ వాసులు అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు. ఈ ఘటనపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 22, 2025
HYDలో అతి పెద్ద పౌల్ట్రీ ఎక్స్‌పో

దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఈవెంట్ ‘పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్-2025’కు భాగ్యనగరం ఆతిథ్యం ఇవ్వనుంది. నవంబర్ 25 నుంచి హైటెక్స్‌లో ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (IPEMA) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ అంతర్జాతీయ ఎక్స్‌పో జరగనుంది. సుమారు 50 దేశాల నుంచి 500కు పైగా ఎగ్జిబిటర్లు, 40వేల మంది సందర్శకులు హాజరుకానున్నారు. సస్టెయినబుల్ ఫీడ్, ఆటోమేషన్ వంటి అంశాలపై చర్చిస్తారు.
News November 22, 2025
HYD: పైలట్‌పై అత్యాచారయత్నం

అత్యాచారయత్నం చేసినట్లు బాధితురాలు HYDలోని బేగంపేట PSలో ఫిర్యాదు చేసింది. ఓ ఏవియేషన్ సంస్థకు చెందిన కమర్షియల్ పైలట్ రోహిత్ శరణ్ (60) సహోద్యోగి అయిన యువతిపై బెంగళూరులో అత్యాచారయత్నం చేశాడు. సంస్థ పని నిమిత్తం బెంగళూరు వెళ్లిన సమయంలో హోటల్ గదిలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు, సంఘటన బెంగళూరు హలసూరు పోలీస్ స్టేషన్ పరిధి కావడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు.
News November 22, 2025
HYD: పెళ్లి కావట్లేదని అమ్మాయి చనిపోయింది..!

ఓ యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సిద్దిపేట(D) మద్దూర్(M) రేబర్తి వాసి కుంటి నిరోష(32) సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తోంది. చింతల్ పద్మానగర్‌లో తన సోదరుడు నరేశ్‌తో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఆమెకు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీనికి తోడు పెళ్లి కావట్లేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. కేసు నమోదైంది.


