News March 23, 2024
HYD: బాలుడి ప్రాణం తీసిన వీధి కుక్క

HYDలో వీధి కుక్కలు మరో బాలుడి ప్రాణం తీశాయి. బాధితులు తెలిపిన వివరాలు.. HYD శామీర్‌పేట్ పరిధి పెద్దమ్మ కాలనీలో భవన నిర్మాణ మేస్త్రీ బాలు.. కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడి పెద్ద కుమారుడు ప్రవీణ్ (11) ఈనెల 18న ఇంటి ముందు ఉండగా ఓ వీధి కుక్క దాడి చేసి కరిచింది. బాలుడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు.
Similar News
News October 23, 2025
HYD: ప్రజాపాలన వైపే ప్రజలు: మంత్రి సీతక్క

జూబ్లీహిల్స్ ప్రజలు ప్రజాపాలన వైపే ఉన్నారని మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు జూబ్లీహిల్స్ పరిధి బోరబండ డివిజన్ స్వరాజ్ నగర్‌లో ఆమె ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైందని స్పష్టం చేశారు. BRS నేతలు ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీ తప్పక గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి నవీన్ యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు ఉన్నారు.
News October 23, 2025
BIG BREAKING: బంజారాహిల్స్‌లో వ్యభిచారం.. అరెస్ట్

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఓ హోటల్లో నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్‌ను కమిషనర్ టాస్క్‌ఫోర్స్ (వెస్ట్ జోన్), బంజారాహిల్స్ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ దాడిలో నిర్వాహకుడు, సెలూన్ వ్యాపారి మహమ్మద్ షరీఫ్, కర్నూలుకు చెందిన ఏడుగురు కస్టమర్లు, హోటల్ రిసెప్షనిస్ట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 9 మందిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.
News October 23, 2025
జూబ్లీహిల్స్ బైపోల్‌లో నో బ్యాలెట్.. ఓన్లీ EVM!

EVMల ద్వారానే జూబ్లీహిల్స్ బైపోల్ నిర్వహిస్తామని HYD జిల్లా ఎన్నికల అధికారి RV కర్ణన్ స్పష్టం చేశారు. నామినేషన్ల పరిశీలన పూర్తి చేసిన అనంతరం 81 మంది అభ్యర్థులకు ఆమోదం లభించింది. రేపు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఇంకెవరైనా ఉపసంహరణకు వెళితే అభ్యర్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అయితే, 64 మందికి పైగా పోటీలో ఉంటే M3 ఈవీఎంలు ఉపయోగించనున్నారు.