News February 2, 2025
HYD: బిల్డర్ వేణుగోపాల్ రెడ్డిది ప్రభుత్వ హత్యే: హరీశ్

ఒకప్పుడు బిల్డర్ అంటే లోన్లు ఇస్తామని బ్యాంకులు వెంటపడేవని రేవంత్ ప్రభుత్వం వచ్చాక బ్యాంకులు లోన్లు ఇవ్వమంటూ ముఖం చాటేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. బిల్డర్ వేణుగోపాల్ రెడ్డిది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనన్నారు. వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని చూస్తే బాధేస్తోందని చెప్పారు.
Similar News
News March 2, 2026
భూపాలపల్లి: ప్రజావాణిలో 65 దరఖాస్తుల స్వీకరణ

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 65 దరఖాస్తులు స్వీకరించి తక్షణ చర్యలకు సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు. ఆయా దరఖాస్తులను అధికారులు జాప్యం చేయకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
News March 2, 2026
కలెక్టర్ జితేష్ పాటిల్‌కి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు

టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీగా బదిలీ అయిన భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్‌కు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. తన భార్యకు రెండో కాన్పు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయించి, సామాన్యులకు సర్కారు వైద్యంపై నమ్మకం కలిగించిన ఆయన సేవలు మరువలేమని, ఆయన బదిలీ జిల్లాకు తీరని లోటని వక్తలు పేర్కొన్నారు.
News March 2, 2026
నిర్మల్: క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలు

రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్స్‌లో (2026-27) 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. 1-09-2017 నుంచి 31-08-2018 మధ్య జన్మించిన వారు అర్హులు. విద్యార్థులు మార్చి 4లోపు tgss.telangana.gov.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం మండల, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో మోటార్ క్వాలిటీ (శారీరక సామర్థ్య) టెస్టులు నిర్వహించి ప్రతిభావంతులను ఎంపిక చేస్తారు.


