News October 28, 2025

HYD: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

image

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై మధురానగర్ PSలో కేసు నమోదైంది. పోలీసుల వివరాలు.. 26న లక్ష్మీ నరసింహనగర్‌లో ఉన్న కాంగ్రెస్ ప్రచార వాహనం డ్రైవర్‌ను హెచ్చరిస్తూ, సైగలు చేస్తూ వెళ్లాడు. ఈ ఘటనను యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శివప్రసాద్ వీడియో తీసి పోలీసులకు అందించగా కేసు నమోదు చేశారు.

Similar News

News October 28, 2025

ఆదిలాబాద్: DEGREE ఫీజు కట్టారా..?

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు గడువును పొడగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 27 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించడానికి గడువు ముగిసింది. రూ.50 అపరాధ రుసుముతో ఈనెల 29 వరకు పొడగించినట్లు వెల్లడించారు. నవంబర్ నెలలో పరీక్షలు ఉంటాయని వివరించారు. కావున విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి సకాలంలో ఫీజు చెల్లించాలని సూచించారు.

News October 28, 2025

జూబ్లీ ఎన్నికల్లో 569 కంట్రోల్ యూనిట్లు

image

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే 4 బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేసి వాటిని సిరీస్ శ్రేణిలో ఏర్పాటు చేసి కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ మిషన్‌ను అనుసంధానిస్తారు. మొత్తం కంట్రోల్ యూనిట్లు 569, బ్యాలెట్ యూనిట్లు 2,442, వీవీ ప్యాట్లు 610 ఉపయోగించనున్నారు.

News October 28, 2025

సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం

image

ముఖ్యమంత్రి చంద్రబాబును సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్‌తో పాటు పలువురు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే నెల 18వ తేదీ నుంచి సత్యసాయి శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు సీఎంకు తెలిపి, ఆహ్వాన పత్రిక అందించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను ట్రస్టు సభ్యులతో సీఎం చర్చించారు. ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు ఉంటాయని సీఎం హామీ ఇచ్చినట్లు రత్నాకర్ తెలిపారు.