News October 7, 2025
HYD: బీజేపీ గుప్పిట్లో ‘కీలకమైన ఏడుగురు’..?

జూబ్లీహిల్స్ బైపోల్‌లో వీవీఐపీ మధ్య యుద్ధానికి తెరపడనుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీబీజేపీ చీఫ్ ఎన్.రామచందర్‌రావు వద్ద ఉన్న కీలక జాబితాల నుంచి ఏడుగురు బలమైన అభ్యర్థులను బీజేపీ వడపోసినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ సీటును పార్టీ ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుందో చెప్పడానికి, అభ్యర్థిని ఎంపిక చేయడానికి ఏకంగా ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయడమే నిదర్శనం.
Similar News
News October 7, 2025
MBNR: వరల్డ్ స్కిల్ కాంపిటీషన్‌కు దరఖాస్తు చేసుకోండి

వరల్డ్ స్కిల్ కాంపిటీషన్-2025లో పాల్గొనేందుకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 15లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రి ప్రియ తెలిపారు. ఈ పోటీల్లో 63 కేటగిరీలలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించవచ్చని, ఇవి జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఉంటాయని చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని అర్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. https://www.skillindiadigital.gov.in
News October 7, 2025
NZB: కలెక్టరేట్‌లో వాల్మీకి జయంతి

వాల్మీకి జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో అధికారికంగా నిర్వహించారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
News October 7, 2025
RTCలో ఉద్యోగాలు.. ముఖ్య గమనిక

TGSRTCలో డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు రేపటి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. SC అభ్యర్థుల కుల ధ్రువీకరణ పత్రాలు వర్గీకరణ ప్రకారం (గ్రేడ్-1,2,3) కొత్త ఫార్మాట్‌లో ఉండాలని అధికారులు తెలిపారు. కొత్త సర్టిఫికెట్‌ను సకాలంలో పొందలేకపోతే, అందుబాటులో ఉన్న SC సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేయవచ్చని చెప్పారు. అయితే, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో కొత్త ఫార్మాట్ కచ్చితంగా చూపించాల్సి ఉంటుందన్నారు. వివరాలకు ఇక్కడ <