News March 5, 2025
HYD: బీజేపీ నిర్ణయం దుర్మార్గం: కేటీఆర్

ఆదిలాబాద్‌లోని సీసీఐ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్ధంకావడం దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సీసీఐని పునఃప్రారంభిస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి ఓట్లు దండుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలంటే బీజేపీకి పట్టింపు లేదని, ఆ సంస్థను స్క్రాప్ కింద అమ్మాలని చూస్తుండటం ప్రజలను వంచించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News February 21, 2026
HYD: ఒక్క రోజు ఛాన్స్.. ఇన్వెస్ట్‌మెంట్ బజార్

తెలంగాణ ప్రభుత్వం ఇంధన రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపింది. ఇంధన సామర్థ్య ప్రాజెక్టులను పరుగులు పెట్టించేందుకు TGREDCO ఆధ్వర్యంలో HYDలో ఒకే ఒక్క రోజు “ఇన్వెస్ట్‌మెంట్ బజార్” నిర్వహిస్తున్నారు. ప్రాజెక్ట్ డెవలపర్లు, ఇన్వెస్టర్లు, బ్యాంకర్లను ఒకే వేదికపైకి చేర్చి, కోట్లాది రూపాయల నిధులు సమకూర్చడమే దీని లక్ష్యం. రాయితీలతో కూడిన వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇది ఒక సువర్ణావకాశం.
News February 21, 2026
HYD: TG EAPCET పరీక్షకు 20వేల దరఖాస్తులు

TG EAPCET ప్రవేశ పరీక్షకి ఈ రోజు ఇంజినీరింగ్ విభాగానికి 12,770 విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించి 7,354 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 2 విభాగాలకు సంబంధించి 19 మంది దరఖాస్తు చేసుకున్నారని కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ రోజు వరకు 20,143 దరఖాస్తుకు వచ్చాయని కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.
News February 21, 2026
HYD: మాతృ భాష ‘బతుకు’నిచ్చింది!

“దేశ భాషలందు తెలుగు లెస్స” ఇది శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన వేదం. సమాజంలో తెలుగు భాషను లోకువ చేసే బ్యాచ్ తెలుసుకోవాల్సిన నిజం. మాతృ భూమి, భాషను నమ్ముకొన్న వాడు ఎక్కడా మోసపోలేదు. తెలుగు, సాహిత్యం మీద పట్టు పెంచుకొన్న ఎందరో కవులు చరిత్రలో నిలిచారు. లక్షలాది మందిని గొప్ప జర్నలిస్టులను చేసింది ఈ మాతృభాషనే. భాషను బతికించుకున్న ఎందరికో బతుకునిచ్చిందని మర్చిపోకండి.
నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.


