News February 22, 2025

HYD: బీజేపీ, బీఆర్ఎస్ బీసీ ద్రోహుల పార్టీలు: అద్దంకి

image

బీజేపీ, బీఆర్ఎస్ బీసీ ద్రోహుల పార్టీలు అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు సంబంధించి దేశంలో ఇంత పెద్ద ఎత్తున విప్లవం వస్తున్న క్రమంలో.. ఎందుకు బీజేపీ బీసీలకు రిజర్వేషన్ల గురించి ఆలోచించదని ప్రశ్నించారు. బీసీలకు రిజర్వేషన్లు సాధించడమే రాహుల్ గాంధీ జీవిత లక్ష్యమని వివరించారు.

Similar News

News February 22, 2025

HYD: ఫాల్కన్ కంపెనీ స్కాం.. రూ.1700 కోట్లు

image

ఫాల్కన్‌ స్కాంపై ఈడీ కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌ కేంద్రంగా ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా రూ.1,700 కోట్లు ఫాల్కన్‌ కంపెనీ వసూలు చేసింది. ఒక్క హైదరాబాద్‌లోనే రూ.850 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. కాగా, ఈ డబ్బును విదేశాలకు మళ్లించినట్లు తెలిపారు. ఈసీఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు.

News February 22, 2025

HYD: చందానగర్‌లో దారుణ హత్య

image

చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. స్థానికుల వివరాలు.. గోపినగర్‌కు చెందిన ఫక్రుద్దీన్,‌ నజీర్ స్నేహితులు. రాత్రి 8 గంటల సమయంలో మాట్లాడే పని ఉందని స్నేహితులు గోపిచెరువు వద్దకు నజీర్‌ను తీసుకెళ్లారు. అక్కడ గొడవ జరగింది. ఫక్రుద్దీన్ దాడిలో నజీర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News February 22, 2025

ఇబ్రహీంపట్నం: ఈ నెల 24న బడుల్లో వంట బంద్

image

రంగారెడ్డిలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ బంద్‌కు పిలుపునిచ్చింది. గురువారం CITU ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని ఇబ్రహీంపట్నం MEOకు మెమోరాండం అందజేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.10 వేల వేతనం ఇస్తామని హామీ ఇచ్చిందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న తెలిపారు. కానీ, ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. ఇందుకు నిరసనగా ఈ నెల 24న బడుల్లో ‘వంట బంద్’ చేసి చలో కలెక్టరేట్‌లో పాల్గొంటామన్నారు.

error: Content is protected !!