News March 31, 2024
HYD: బీసీలకు భిక్షం వద్దు.. హక్కులు కావాలి: R.కృష్ణయ్య
లోక్‌సభ ఎన్నికల్లో BRS, కాంగ్రెస్, బీజేపీ.. బీసీలకు జనాభా ప్రాతిపదికన టికెట్లు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేశాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్, గుజ్జ కృష్ణ అధ్యక్షతన ఆదివారం కాచిగూడలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. బీసీలకు భిక్షం వద్దని.. రాజ్యాంగబద్ధమైన హక్కులు కావాలని అన్నారు.
Similar News
News February 1, 2025
HYDలో రూ. 50కే డోర్ డెలివరీ!
HYDలో ఎక్కడికైనా కేవలం రూ.50కే కిలో వరకు బరువు కలిగిన సామగ్రిని డోర్ డెలివరీ చేస్తున్నట్లు ఆర్టీసీ కార్గో అధికారులు తెలిపారు. నగరవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. వస్తువు బరువు ప్రకారం ఛార్జీలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉప్పల్, రామంతాపూర్, హబ్సిగూడ, ఎల్బీనగర్ లాంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా కార్గో కౌంటర్లు ఏర్పాటు చేశారు.SHARE IT
News January 31, 2025
HYD: తల్లి మృతి.. 9 రోజులు ఇంట్లోనే మృతదేహం
వారాసిగూడలో విషాద ఘటన వెలుగుచూసింది. తల్లి మృతి చెందడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన కూతుళ్లు 9 రోజులుగా ఇంట్లోనే ఉండిపోయారు. దుర్వాసన రావడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా ఈ విషయం వెలుగుచూసింది. MLA పద్మారావు చొరవతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని గాంధీకి తరలించారు. మృతురాలు శ్రీ లలిత (45) అని పేర్కొన్నారు. తల్లిని కోల్పోయిన రవళిక (25), అశ్విత (22) కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
News January 31, 2025
HYD: గద్దర్ జయంతి.. సీఎం సందేశం
గద్దర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులర్పించారు. తన కలం, గళంతో గద్దర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదారని, సమాజంలో అసమానతలు, వివక్షలకు వ్యతిరేక గొంతుక అని సీఎం రేవంత్ స్మరించుకున్నారు. గద్దర్ జయంతిని ప్రజా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు, ఆయన పేరుతో అవార్డు నెలకొల్పి ఏటా కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ప్రదానం చేయాలని నిర్ణయించిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు.