News May 23, 2024

HYD: బురదలో కూర్చొని యువతి నిరసన

image

HYD ఎల్బీనగర్ పరిధి నాగోల్-ఆనంద్ నగర్ రోడ్డుపై ఉన్న బురదలో ఓ యువతి కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. రోడ్లు మొత్తం గుంతలమయంగా మారి, వర్షం నీరు చేరి అవస్థలు పడుతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గుంతల్లో పడి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని మండిపడ్డారు. గ్రేటర్ HYDలో అనేక చోట్ల ఇదే పరిస్థితి ఉందని, ఇప్పటికైనా GHMC యంత్రాంగం స్పందించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

Similar News

News October 1, 2024

HYD: వచ్చే వేసవి కోసం రూ.384 కోట్లతో ప్రణాళిక

image

గ్రేటర్ HYD, RR, మేడ్చల్ ప్రాంతాల్లో వచ్చే వేసవిలో కరెంటు లోడు సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వేసవి కార్యాచరణపై విద్యుత్ సంస్థ దృష్టి పెట్టినట్లుగా ఎండి ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. రూ.384 కోట్లతో HYD, మేడ్చల్, రంగారెడ్డి జోన్లలో ప్రత్యేక 33/11KV ఉప కేంద్రాల ఏర్పాటు, ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు.

News October 1, 2024

HYD: రూ.కోట్ల డ్రగ్స్ దందా.. దేశవ్యాప్తంగా లింకులు!

image

HYD నగరం నుంచి డ్రగ్స్ దందా నడుపుతున్న ముఠాల సభ్యులకు దేశవ్యాప్తంగా లింకులు ఉన్నట్లు బయటపడింది. గంజాయి, అల్ఫ్రాజోలం, ఎంఫిటమైన్, MDM, హాష్ ఆయిల్ సహా అనేక రకాల డ్రగ్స్ తెలంగాణ రాష్ట్రంలో విక్రయిస్తున్న ముఠా సభ్యులకు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు ఉన్నట్లు పలు విచారణల్లో వెల్లడైంది. HYD నగరంలో డ్రగ్స్ దందాను ఒక వ్యాపారంగా చేస్తున్నారు.

News October 1, 2024

రాజస్థాన్‌లో HYD పోలీస్ ఆపరేషన్ SUCCESS

image

రాజస్థాన్‌లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. రాజస్థాన్ కేంద్రంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లకోసం రిక్కీ నిర్వహించారు. పక్కా ప్లాన్‌తో వారి స్థావరాలపై మెరుపుదాడి చేసి 27 మందిని అరెస్ట్ చేశారు.