News October 5, 2025
HYD- బెంగుళూరు వెళ్తున్న ఫ్లైట్‌లో సాంకేతిక లోపం

HYD నుంచి బెంగళూరుకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ IX-1072 సాంకేతిక లోపంతో ఆలస్యం అయింది. మొదట బే నం.57L వద్ద లోపం తలెత్తగా, తర్వాత బే నం.45కు మార్చి సాయంత్రం 6:24కు విమానం బయలుదేరింది. ఈ ఫ్లైట్‌లో 166 మంది ప్రయాణికులు, అందులో పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా ఉన్నారు.
Similar News
News October 5, 2025
జూబ్లీహిల్స్ బైపోల్‌లో మిగిలింది ముగ్గురే?

జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. అభ్యర్థుల జాబీతాలో నవీన్‌యాదవ్, మాజీ మేయర్ బొంతురామ్మోహన్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పేర్లను చేర్చారు. ఇన్‌ఛార్జ్ మంత్రులు షార్ట్‌లిస్ట్‌ను ఫైనల్ చేశారు. అనంతరం స్క్రీనింగ్ కమిటీకి ఈ లిస్ట్‌ను TPCC పంపనుంది. త్వరలోనే అభ్యర్థిని హైకమాండ్ ఫైనల్ చేయనుంది. దీంతో జాబ్లీ హైడ్రామాలో కొత్త అభ్యర్థుల పేర్లతో మరో మలుపు తీసుకుంది.
News October 5, 2025
టార్గెట్ జూబ్లీహిల్స్.. నేడు బీజేపీ కీలక సమావేశం

స్థానిక ఎన్నికల సమరానికి కమలదళం సమాయత్తమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, జుబ్లీహిల్స్ ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు పార్టీ నాయకత్వం నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు అధ్యక్షతన జరగనున్న పదాధికారుల సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. స్థానిక ఎన్నికల సన్నద్ధత, జూబ్లీహిల్ ఉపఎన్నిక అభ్యర్థిత్వంపై చర్చించనుంది.
News October 5, 2025
HYD: ఈ నం.కు 9240021456 కాల్ చేయండి

స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఇప్పటికే ఆశావహులు ఓటర్లను ప్రసన్న చేసుకుంటున్నారు. వారిని ప్రలోబాలకు గురిచేసే అవకాశం ఉండటంతో HYDలోని ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో EC కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఎన్నికల సమాచారం, ఫిర్యాదులు, ఓటర్ లిస్ట్ వివరాలకు 92400 21456ను సంప్రదించాలని అధికారులు సూచించింది. రేపో మాపో జూబ్లీహిల్స్ బైఎలక్షన్ నోటిఫికేషన్ రావొచ్చు. సేవ్ చేసుకోండి ఈ నం. అవసరం పడుతుంది.