News January 21, 2026

HYD: బెస్ట్‌ రీల్‌కు రూ.10,000

image

హైదరాబాద్‌కు 150 కిలోమీటర్ల మేర ఉన్న 500లకు పైగా వీకెండ్ స్పాట్స్ ఇప్పుడు మీ కెమెరా కోసం వెయిట్ చేస్తున్నాయి. FTCCI నిర్వహిస్తున్న ఈ మెగా రీల్స్ కాంటెస్ట్ గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగించారు. పాత కోటలు, జలపాతాలు, ఫేమస్ దాబాల అందాలను 60 సెకన్ల వీడియోలో బంధించండి. బెస్ట్ రీల్స్‌కు రూ.10,000 వరకు నగదు బహుమతులతో పాటు క్రేజీ గుర్తింపు పొందే ఛాన్స్! తెలంగాణ టూరిజాన్ని మీ స్టైల్‌లో వైరల్ చేయండి.

Similar News

News January 24, 2026

BIG BREAKING: నాంపల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్.. ఇటు వెళ్లకండి!

image

నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదం వల్ల ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని సందర్శకులు తమ ఎగ్జిబిషన్ పర్యటనను ఈ రోజు వాయిదా వేసుకోవాలని CP సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. కాగా, ఇప్పటికే అబిడ్స్-నాంపల్లి మార్గంలో వాహనాల కదలిక మందగించింది. అబిడ్స్ నుంచి ఎంజే మార్కెట్ మార్గంలో వాహనాలను మళ్లించినా.. పరిస్థితి అదుపులోకి తేవడం కష్టతరమవుతోంది.

News January 24, 2026

HYD: కళల కాణాచి.. రవీంద్రభారతి!

image

రవీంద్రభారతి చుట్టూ ట్రాఫిక్ హారన్‌ల గోల మధ్యనూ సంగీత సౌరభాలను ప్రశాంతంగా పరిమళింపజేస్తోంది. సాహిత్య కుసుమాలు, నాట్య మయూరాలను పట్నానికి పరిచయం చేస్తోంది. రవీంద్రనాథ్ ఠాగూర్ శతాబ్ది సందర్భంగా 1960 మార్చి 23న శంకుస్థాపన చేశారు. సర్వేపల్లి చేతుల మీదుగా 1961 మే 11న ప్రారంభించారు. మోహమ్మద్ ఫయాజుద్దీన్ డిజైన్ చేశారు. 1989 నుంచి రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖే నిర్వహణ చూస్తోంది. హైదరాబాద్‌కు షాన్ అయింది.

News January 24, 2026

HYD: డేటింగ్‌కు పిలుస్తారు.. ఉన్నదంతా ఊడ్చేస్తారు..!

image

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లోని పలు పబ్‌లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయి. అర్ధరాత్రి దాటినా అశ్లీల నృత్యాలు, డ్రగ్స్ విక్రయాలు సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల MDMA వంటి మత్తుపదార్థాలు పట్టుబడటం సంచలనం రేపింది. మరోవైపు, డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయమైన యువతులు బాధితులను పబ్‌లకు పిలిపించి, భారీగా బిల్లులు వేయించి పరారవుతున్నట్లు మోసాలు వెలుగు చూస్తున్నాయి.