News March 24, 2024
HYD: బేగంబజార్‌లో రూ.25 లక్షలు పట్టివేత

ఎన్నికల నేపథ్యంలో HYD బేగంబజార్ విష్ణు ఫైర్ వర్క్ సమీపంలో ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా యాదాద్రి జిల్లాకు చెందిన కిరణ్ రెడ్డి, కళ్లెం జంగారెడ్డి యాక్టివాపై రావడంతో ఆపి తనిఖీలు నిర్వహించారు. వారి వద్ద రూ.25 లక్షలు లభించగా డబ్బులకు సంబంధించిన ఎలాంటి పత్రాలను చూపకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. అనంతరం డబ్బులను సంబంధిత అధికారులకు అప్పగించినట్లు ఏసీపీ చంద్రశేఖర్ తెలిపారు.
Similar News
News September 7, 2025
పండగ రద్దీ తగ్గించేందుకు ఇతర స్టేషన్లకు రైళ్ల మళ్లింపు

దసరా, దీపావళి పండగల కోసం సొంతూరికి వెళ్లేందుకు ప్రయాణికులు సెప్టెంబర్ నుంచే సికింద్రాబాద్ స్టేషన్‌కు క్యూ కడతారు. అధిక రద్దీ కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా కొన్ని రైళ్లను ఇతర స్టేషన్లకు మళ్లించనున్నారు. సనత్‌నగర్, చర్లపల్లి, అమ్ముగూడ, మౌలాలి స్టేషన్లకు మళ్లించాలని నిర్ణయించారు. పండగ రద్దీ కారణంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సిటీ పోలీస్, ఆర్టీసీ సిబ్బంది సేవలను ఉపయోగించుకోనున్నారు.
News September 7, 2025
HYD: పదేళ్లు కాంగ్రెస్‌ను అధికారంలో ఉంచేందుకు శ్రమిస్తున్నా: మహేశ్ కుమార్

పదేళ్ల తర్వాత పవర్‌లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని పదేళ్ల పాటు అధికారంలో ఉంచేందుకు శ్రమిస్తున్నానని MLC, TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ HYDలో అన్నారు. KCRను గద్దె దించేందుకు ప్రత్యేక స్ట్రాటజీ అమలు చేశామని, CM రేవంత్ రెడ్డికి,తనకు కెమెస్ట్రీ బాగా కుదిరిందన్నారు. ఇద్దరి అభిప్రాయాలు ఏకీకృతమవుతున్నాయని చెప్పారు. అధికారంలోకి వచ్చాక అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని జోడెద్దుల్లా ముందుకు నడుపుతున్నామన్నారు.
News September 7, 2025
అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం: మేయర్

ప్రమాదవశాత్తు టస్కర్ కింద పడి మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు రేణుక కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. లిబర్టీలో విధులు నిర్వర్తిస్తూ రోడ్డును దాటుతోన్న క్రమంలో రేణుకను <<1763786>>టస్కర్ ఢీ<<>> కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె మృతి చెందారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్లు GHMC వర్గాల నుంచి సమాచారం.