News October 17, 2024

HYD: బైకులు ఎత్తుకెళ్తున్నారు.. జాగ్రత్త..!

image

ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు చెందిన వారు స్థానికులతో చేతులు కలిపి బండ్లను కొట్టేస్తున్నట్లు పోలీసులు తాజాగా తేల్చారు. HYD పాతబస్తి, శివారు ప్రాంతాల్లో దొంగతనాల కోసం మైనర్లకు కమీషన్లు ఆశ చూపిస్తున్నారు. కేవలం 10 సెకండ్లలో హ్యాండిల్ లాక్ తీసి ఎత్తుకెళ్తున్నారు. ఈ ఏడాది HYDలో 1,300 పైగా బైక్ చోరీ కేసులు నమోదు అయ్యాయి. ఇంటి బయట బైక్‌లు పార్కింగ్ చేసేవారు జాగ్రత్త. #SHAREIT

Similar News

News November 23, 2024

TGSRTC పనితీరుపై HYDలో మంత్రి పొన్నం సమీక్ష

image

హైదరాబాద్‌లోని ర‌వాణా శాఖ ప్ర‌ధాన కార్యాల‌యంలో శ‌నివారం TGSRTC పనితీరుపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మ‌హాల‌క్ష్మి-మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణ సౌక‌ర్యం, కొత్త బ‌స్సుల కొనుగోలు, లాజిస్టిక్స్, ఆర్థిక ప‌ర‌మైన అంశాలపై ప్ర‌ధానంగా చ‌ర్చించారు. ఈ అంశాల‌ను ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా మంత్రికి ఆర్టీసీ ఉన్నతాధికారులు వివరించారు.

News November 23, 2024

జూబ్లీహిల్స్: శివలింగం నుదుటిపై సింధూరమైన సూర్యకిరణాలు

image

జూబ్లీహిల్స్ వెంకటగిరిలోని శ్రీ వీరాంజనేయ సన్నిధిలో అద్భుతం చోటు చేసుకుంది. శివునికి అభిషేకం చేస్తున్న సమయంలో సూర్యకిరణాలు శివలింగం నుదుటిపై సింధూరంలా కనిపించాయి. సూర్యకిరణాలు నేరుగా స్వామి మీద పడి.. సింధూరంలో కనిపించిందని రామంజి గురుస్వామి, కమిటీ సభ్యులు తెలిపారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారన్నారు.

News November 23, 2024

జూబ్లీహిల్స్: సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న సీఎస్

image

సమగ్ర కుటుంబ సర్వేలో సీఎస్ శాంతి కుమారి పాల్గొని వివరాలను అందజేశారు. శుక్రవారం సీఎస్ ఇంటికి వెళ్లిన అధికారులు వివరాలను సేకరించారు. అధికారులకు సీఎస్ పూర్తి వివరాలు సంబంధిత పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. సర్వే ప్రక్రియను ఎన్యుమరేటర్ నీరజ, సర్కిల్ నోడల్ అధికారి సాయి శ్రీనివాస్, జూబ్లీహిల్స్ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి పరిశీలించారు.