News November 11, 2025
HYD: బైక్‌లపై వచ్చి ఇంటింటా ‘ఓటు కవర్’ డెలివరీ!

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రేపు(మంగళవారం) బైపోల్ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. పోలీసులు, ఎన్నికల అధికారుల నిఘా ఉన్నప్పటికీ, బైక్‌లపై కొందరు పేపర్ బాయ్ తరహాలో బస్తీల్లోని ప్రతి ఇంటి వద్దకు వచ్చి, డబ్బు, గుర్తుతో ఉన్న ఎన్వలప్ కవర్లను విసిరేసి పోతున్నారు. ఓటు కోసం విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీని నియంత్రించేందుకు అధికార యంత్రాంగం చర్యలు ముమ్మరం చేసింది.
Similar News
News November 11, 2025
JGTL: నేడు అభివృద్ధి, సమన్వయ మానిటరింగ్ కమిటీ సమావేశం

జగిత్యాల కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి, సమన్వయ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని కమిటీ ఛైర్మన్, ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో రేపు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి రఘువరన్ తెలిపారు. సమావేశానికి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు, ఎమ్మెల్యేలు తదితరులు హాజరుకానున్నారన్నారు.
News November 11, 2025
జిల్లాలో 3.41 లక్షల MTల ధాన్యం కొనుగోలు

వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ కె.రామకృష్ణరావు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. మంత్రి ఉత్తం 1,640 కేంద్రాలు వెంటనే ప్రారంభించి, 48 గంటల్లో చెల్లింపులు చేయాలని ఆదేశించారు. జిల్లాలో 394 కేంద్రాలతో 3.41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు.
News November 11, 2025
అమ్మోనియం నైట్రేట్ అంత డేంజరా?

ఢిల్లీ పేలుడులో <<18253212>>అమ్మోనియం<<>> నైట్రేట్ వాడినట్లు అనుమానిస్తున్న సంగతి తెలిసిందే. దీనిని విరివిగా ఎరువుల్లో ఉపయోగిస్తారు. మండే స్వభావం ఎక్కువగా ఉండటంతో పేలుడు పదార్థాల్లో వాడుతారు. ఈ పేలుడు శక్తివంతమైనదని, చుట్టుపక్కల వస్తువులను క్షణాల్లోనే నాశనం చేయగలదని నిపుణులు చెబుతున్నారు. జనావాసాల్లో దీనిని పెద్ద ఎత్తున నిల్వ చేయడంపై నిషేధం ఉంది. తాజాగా హరియాణాలో వీటి నిల్వలను భారీగా గుర్తించారు.


