News March 27, 2024
HYD: బైక్ ఓవర్ టేక్.. యాక్సిడెంట్

రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన మేడ్చల్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. దుండిగల్ నుంచి బైక్‌పై మేడ్చల్ వైపు వస్తున్న ఓంప్రకాశ్(23) స్థానిక అయోధ్య చౌరస్తా వద్ద లారీని ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొన్నాడు. దీంతో ఓంప్రకాశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఓవర్ టేక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు.
Similar News
News December 14, 2025
HYD: అరుదైన దృశ్యం.. ఇంటిపై ఇలవేల్పు!

మేడ్చల్ జిల్లా రాంపల్లిలో కులవృత్తి గౌరవాన్ని చాటిచెప్పే అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. గౌడ సామాజిక వర్గానికి చెందిన ఎలిజాల మహేశ్ గౌడ్ తన ఇంటి ఎలివేషన్‌పై తాటి చెట్టెక్కుతున్నట్లు.. కల్లు పోస్తున్నట్లు సంప్రదాయ దృశ్యాలతో కళాత్మకంగా అలంకరించారు. వృత్తి సంస్కృతిని తరతరాలకు గుర్తు చేసేలా రూపొందిన ఈ అలంకరణ స్థానికులను ఆకట్టుకుంటోంది. కులవృత్తి పట్ల గుర్తింపును చాటే ఈ ప్రయత్నం ప్రశంసలు అందుకుంటోంది.
News December 14, 2025
SP బాలు విగ్రహానికి ‘సమైక్య’ ముద్ర

AP-TG సెంటిమెంట్‌ను విగ్రహాలు మరోసారి రాజేశాయి. SP బాలు విగ్రహాన్ని రవీంద్రభారతిలో DEC 15న CM, వెంకయ్య నాయుడు ఆవిష్కరించనున్నారు. ఈ నిర్ణయాన్ని TG వాదులు వ్యతిరేకించగా ప్రభుత్వం కళను గౌరవించే చర్యగా సమర్థించుకుంటోంది. ఇదేరోజు ట్యాంక్‌బండ్ మీద కుమురం భీం, రాణి రుద్రమ దేవి, శ్రీకృష్ణదేవరాయ, వీరేశలింగం, ఆర్థర్ కాటన్ వంటి తెలుగు మహనీయుల విగ్రహాల వార్షిక నిర్వహణకు HMDA కాంట్రాక్ట్‌ను ఖరారు చేసింది.
News December 14, 2025
డీలిమిటేషన్.. పోటెత్తిన ఫిర్యాదులు

GHMC వార్డుల డీలిమిటేషన్ మీద అభ్యంతరాల వెల్లువ కొనసాగుతోంది. 3 రోజుల్లోనే ఏకంగా 693 ఫిర్యాదులు అందడం అధికార యంత్రాంగాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. మొదటి రోజు (డిసెంబర్ 10) 40 ఫిర్యాదులు, రెండవ రోజు 280, అత్యధికంగా 373 ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా కొత్తగా విలీనమైన 27 మున్సిపాలిటీల్లోనే ఈ అభ్యంతరాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో ఉన్న అసంతృప్తి తీవ్రతను ఈ ఫిర్యాదుల సంఖ్య సూచిస్తోంది.


