News September 4, 2025

HYD: బైక్, కారు కడిగాడు.. రూ.10 వేలు జరిమానా

image

HYD బంజారాహిల్స్‌లో తాగునీటిని అప్రయోజనాలకు వాడిన ఇద్దరిపై హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) చర్యలు తీసుకుంది. బైక్, కారు కడిగిన వ్యక్తికి రూ.10,000, నీరు ఓవర్‌ఫ్లో అయ్యేలా వదిలిన మరొకరికి రూ.5,000 జరిమానా విధించింది. తాగునీరు వినియోగం కోసం మాత్రమేనని, దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు.

Similar News

News September 5, 2025

కృష్ణా: యూరియా సరఫరాపై నిరంతర పర్యవేక్షణ

image

కృష్ణా జిల్లాలో యూరియా సరఫరాపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. యూరియా ఇతర అవసరాలకు మళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. PACSల ద్వారా మాత్రమే రైతులకు యూరియా పంపిణీ చేస్తున్నారు. కలెక్టర్ డీకే బాలాజీ నిరంతరం PACSలను సందర్శిస్తూ సరఫరా తీరును పర్యవేక్షిస్తున్నారు. డిమాండ్ పెరగడంతో ఇతర జిల్లాల నుంచి 500 టన్నుల యూరియాను జిల్లాకు రప్పించారు.

News September 5, 2025

మహబూబాబాద్: నెల రోజుల్లో పెళ్లి.. ఇంతలో..!

image

గాయత్రీ గుట్ట వద్ద కురవి మండలం థాట్యా తండాకు చెందిన రాంబాబు అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా వచ్చే నెలలో కుటుంబ సభ్యులు రాంబాబు పెళ్లి నిశ్చయించారు. అయితే స్నేహితులతోని కలిసి బయటికి వెళ్లి వస్తానని రాంబాబు, అతడి బావ కారు తీసుకుని స్నేహితులతో బయటికి వెళ్లి నేషనల్ హైవేపై శవమై కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 5, 2025

అనిల్ అంబానీ రుణ ఖాతాలు మోసపూరితం: బ్యాంక్ ఆఫ్ బరోడా

image

రిలయన్స్ కమ్యూనికేషన్స్, దాని మాజీ డైరెక్టర్ అనిల్ అంబానీ రుణఖాతాలు మోసపూరితమని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించినట్టు Stock Exchangesకు ఆ సంస్థ సమాచారం ఇచ్చింది. అయితే BOB ఆరోపణలను ఖండిస్తున్నట్టు అనిల్ అధికార ప్రతినిధి తెలిపారు. సమస్య పరిష్కారం కోసం ఆయన న్యాయ సలహాలు తీసుకుంటారని వెల్లడించారు.