News July 3, 2024
HYD: బోనాల చెక్కుల పంపిణీకి సిద్ధం: కలెక్టర్
ఆషాఢ మాస బోనాల జాతర ఉత్సవాలకు సంబంధించి వివిధ శాఖల అధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లు పూర్తి కానున్నాయని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బోనాల పండగ నేపథ్యంలో ఆలయాలకు ఇవ్వాల్సిన చెక్కులు పంపిణీకి సిద్ధమయ్యాయని వెల్లడించారు. ఒకట్రెండు రోజుల్లో వాటిని పంపిణీ చేస్తామన్నారు. ఈనెల 7న జగదాంబ మహంకాళి గోల్కొండ, లంగర్ హౌస్ నుంచి తొట్టెల ఊరేగింపును మంత్రులు ప్రారంభిస్తారని చెప్పారు.
Similar News
News December 21, 2024
రాష్ట్రపతి నిలయం సందర్శనకు వారికి స్పెషల్ ఎంట్రీ
రాష్ట్రపతి నిలయం సందర్శనకు వసతి గృహాల విద్యార్థులకు ప్రత్యేక ప్రవేశం కల్పించనున్నారు. పిక్నిక్ స్పాట్‌లా ఉండేలా పిల్లలకు ప్లే ఏరియా, ఉద్యాన ఉత్సవాన్ని తిలకించేందుకు వసతి గృహాల విద్యార్థులను రాష్ట్రపతి నిలయానికి తీసుకువచ్చి ఆహ్లాదకర వాతావరణంలో జ్ఞాపకాలు గుర్తుండిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన తాగునీరు, అంబులెన్స్, మొబైల్ టాయిలెట్లు, రవాణా, లైటింగ్ వంటి మౌళిక వసతులు కల్పిస్తున్నారు.
News December 21, 2024
HYD: మహిళా సాధికారతకు కృషి చేయాలి: ఇలంబర్తి
నగరంలో మహిళలు సాధికారత సాధించేందుకు కృషి చేయాలని కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్లో ఎస్టేట్, అర్బన్ కమ్యూనిటీ విభాగం ఆడిషనల్ కమిషనర్లు, ప్రాజెక్టు అధికారులతో పాటు జోనల్ పీఓలు, ఆసిస్టెంట్ ఎస్టేట్ అధికారులతో అయాశాఖల ప్రగతిపై కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. దీనికి అర్హులైన మహిళలను స్వయం సహాయక సంఘాలలో చేర్పించాలన్నారు.
News December 21, 2024
HYDలో నుమాయిష్ Loading!
హైదరాబాద్‌లో భారీ పారిశ్రామిక ప్రదర్శనకు సమయం ఆసన్నమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్-2025కు సర్వం సిద్ధం చేస్తున్నారు. దాదాపు 2500 స్టాళ్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, 2000పైగా స్టాళ్లు ఈ సారి ఏర్పాటు చేస్తున్నారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు నుమాయిష్ కొనసాగనుంది.