News June 11, 2024
HYD: బ్యాంక్ ఆఫ్ బరోడాతో తెలంగాణ అగ్నిమాపక శాఖ ఒప్పందం

బ్యాంక్ ఆఫ్ బరోడాతో తెలంగాణ అగ్నిమాపక శాఖ వేతనాలు, పెన్షన్లు, ప్రమాద బీమా వంటి అంశాలపై అవగాహన ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర పోలీసులకు ఇస్తున్న కవరేజీ, సేవలు, ప్రత్యేక ఆఫర్లను అగ్నిమాపకశాఖ సిబ్బందికి కూడా అందించనున్నారు. ఈ మేరక అగ్నిమాపక సేవల శాఖ డీజీ వై.నాగిరెడ్డి, బ్యాంక్ ఆఫ్ బరోడా హైదరాబాద్ జోన్ జనరల్ మేనేజర్, జోనల్ హెడ్ రితేశ్ కుమార్ సోమవారం ఎంవోయూపై సంతకాలు చేశారు.
Similar News
News February 20, 2026
HYD: మలి దశను మలుపు తిప్పిన మహోద్యమలు

ప్రత్యేక తెలంగాణ సాధనకు హైదరాబాద్ ఉద్యమాలకు కేంద్రబిందువైంది. ‘మిలియన్ మార్చ్’ ఉప్పెనలా ఉప్పొంగింది. ‘సాగరహారం’ ఉద్యమానికి ఉవ్వెత్తున ఊపిరిపోసింది. ‘సకలజనుల సమ్మె’ రాష్ట్రాన్ని స్థంభింపజేసింది. ‘మానవహారం’ ఉద్యమ ఆత్మను ప్రతిబింబించాయి. ‘సడక్‌బంద్’ సమైక్య పాలకులకు సమస్య తీవ్రతను చాటిచెప్పింది. చివరకు 2014 FEB 20న RSలో బిల్లు పాసై నాలుగున్నర కోట్ల మోముల్లో నవ్వులు పూశాయి.
News February 20, 2026
HYD: తల్లి మృతికి కారణమైనందుకే గర్భిణీ హత్య!

వనస్థలిపురం PS పరిధి కప్పలచెరువు సమీపంలో బుధవారం సునీతను హత్య చేసిన <<19181178>>నిందితుడు<<>> మహేష్(30)ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర వాసి సునీతను 2022లో వివాహం చేసుకోగా వివాదాలతో అతనిపై వేధింపుల కేసు పెట్టింది. 2024లో పరస్పర విడాకులు జరిగి ఆమె 2025లో రెండో వివాహం చేసుకుంది. కేసుల వేధింపులతో అతని తల్లి ఇటీవలే మరణించింది. దీంతో పగ పెంచుకుని చంపానని నిందితుడు మహేష్ ఒప్పుకున్నాడు.
News February 20, 2026
హైదరాబాద్‌లో ₹25వేల శాలరీతో జాబ్స్

ECIL HYDలో 200 పోస్టులు భర్తీ చేయనుంది. టెక్నికల్ ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్ (TO-C) పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు BTechలో 60% మార్కుల ఉత్తీర్ణతతో పాటు వృత్తిలో అనుభవం గల అభ్యర్థులు ఫిబ్రవరి 24న ECIL HYDలో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. నెలకు ₹25,000 జీతం ఉంటుంది. మరిన్ని వివరాలకు https://www.ecil.co.in/jobopenings చూడండి.


