News August 29, 2025
HYD: బ్రహ్మసూత్ర మరకత శివలింగంపై సూర్యకిరణాలు

HYD శివారు శంకర్‌పల్లిలోని చందిప్ప గ్రామంలో గల 11వ శతాబ్దపు శ్రీరాముడు ప్రతిష్ఠించిన పురాతన బ్రహ్మసూత్ర మరకత శివలింగంపై శుక్రవారం ఉదయం సూర్య కిరణాలు పడ్డాయి. ఆలయ అర్చకుడు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. శివలింగంపై సూర్య కిరణాలు పడటం చాలా అరుదని ఆలయ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.
Similar News
News September 1, 2025
MNCL: ముగిసిన కళా ఉత్సవ పోటీలు

మంచిర్యాలలోని జిల్లా సైన్స్ కేంద్రంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న కళా ఉత్సవ పోటీలు సోమవారం ముగిశాయి. జిల్లాలోని దాదాపు 440 మంది విద్యార్థులు 11 అంశాలలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను గెలుచుకున్న విద్యార్థులను డీఈఓ యాదయ్య అభినందించారు. జిల్లాలో మొదటి స్థానాన్ని పొందిన విద్యార్థులు త్వరలో రాష్ట్రస్థాయిలో కళా ఉత్సవ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
News September 1, 2025
కురబలకోట: కొడుకు దొంగిలించిన డబ్బును చెల్లించిన తండ్రి

కురబలకోట మండలంలోని జంగావారిపల్లిలో ఉండే వెంకటరమణ సోమవారం తన కొడుకు దొంగిలించిన డబ్బును చెల్లించాడు. వెంకటేశ్ తెట్టు సచివాలయంలో విద్యుత్ సెక్రటరీగా ఉంటూ రూ.4.64 లక్షల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల డబ్బుతో పరారయ్యాడని అధికారులు తెలపడంతో కొడుకు భవిష్యత్ కోసం అధికారులతో చర్చలు జరిపి, ఎన్నో ప్రయసాలతో రూ.3 లక్షలను అధికారుల సమక్షంలో కురబలకోట ఎంపీడీవోకు చెల్లించాడు.
News September 1, 2025
HYD: 9 రోజులుగా దొరకని అవయవాలు

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బోడుప్పల్‌లో గత నెల 24న భర్త హత్య చేసి, ముక్కలుగా మార్చి మూసీలో పడేసిన స్వాతి అవయవాలు ఇప్పటికీ లభించలేదు. 9 రోజులుగా DRF, హైడ్రా బృందాలు ప్రతాపసింగారం మూసీ వంతెన వద్ద జల్లెడ పట్టినా ఫలితం శూన్యమైంది. మూసీలో ఎక్కడా ఆనవాళ్లు కనిపించకపోవడంతో దర్యాప్తు మరింత క్లిష్టమైంది. గాలింపు యత్నాలు ఫలించకపోవడంతో కేసు సవాలు అవుతోంది.