News January 29, 2025
HYD బ్రాండ్ ఇమేజ్ పెంచుతాం: మంత్రి శ్రీధర్ బాబు

HYD, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచుతామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. దావోస్ పెట్టుబడులపై ఆయన మంగళవారం వివరాలు వెల్లడించారు. మూసీ నది ప్రక్షాళన, నిరుద్యోగ యువతి యువకుల నైపుణ్యం పెంచేలా సింగపూర్‌లో CM చర్చలు జరిపారన్నారు. HYD ప్రజలకు మెరుగైన జీవనం కల్పించేలా ప్రస్తావించామన్నారు. సింగపూర్ మంత్రులు దీనిపై ఆసక్తి చూపించారన్నారు. యువత భవిష్యత్తు కోసమే యంగ్ ఇండియా యూనివర్సిటీ తీసుకొచ్చామన్నారు.
Similar News
News February 25, 2026
సైబరాబాద్ కమిషనరేట్‌కు కొత్తగా 2 పోలీస్ కేనైన్‌లు

తెలంగాణ సీఐడీ నుంచి రెండు పోలీస్ కేనైన్‌లు సైబరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ అయ్యాయి. దీంతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న జాగిలాల సంఖ్య18కు చేరింది. పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాల గుర్తింపు, ట్రాకింగ్ వంటి కీలక విధుల్లో ఇవి సేవలందించనున్నాయి. సీఐడీ నుంచి వచ్చిన ‘రానా’ (బెల్జియన్ మాలినోయిస్), ‘రాడో’ (లాబ్రడార్) నేరాల ఛేదనలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు.
News February 25, 2026
HYDలో ఇలా చేస్తే రూ.2లక్షల FINE!

నిర్మాణ వ్యర్థాల పారబోతపై GHMC పకడ్బందీగా వ్యవహరించనుంది. నాలాలు, చెరువుల్లో వ్యర్థాలు పారబోస్తే రూ.2 లక్షల ఫైన్ విధించే అవకాశం ఉంది. ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు డంప్ చేసినా ఫైన్ విధిస్తామని అధికారులు హెచ్చరించారు. బస్‌భవన్, VST పాత ఆఫీసు ఎదురు గల్లీలో నిర్మాణ వ్యర్థాలతో రోడ్డు మూసుకుపోవడం గమనార్హం. ఇలాంటివి రిపీట్ కావొద్దంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందే.
News February 25, 2026
HYD: బుక్స్‌ను గౌరవిద్దాం.. పర్యావరణాన్ని కాపాడదాం!

పరీక్షలు ముగిసిన తర్వాత పుస్తకాలను చింపి రోడ్లపై వేయకుండా, విద్యార్థులు క్రమశిక్షణతో వ్యవహరించాలని HYDలోని విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. పుస్తకాలు జ్ఞానానికి ప్రతీకలని, సరస్వతి దేవతతో సమామానంగా కొలిచే వాటిని అగౌరపరచొద్దని, అవసరమైనవారికి అందించాలని గుర్తు చేస్తున్నారు. రోడ్లపై పేపర్లు వేస్తే పారిశుద్ధ్య కార్మికులపై భారం పడుతుందని, నగరాన్ని నీట్‌గా ఉంచడంలో అందరూ సహకరించాలన్నారు.


