News December 16, 2025

HYD: భగత్‌సింగ్ వీలునామా.. విప్లవానికి అక్షరనామా

image

‘భగత్‌సింగ్ వీలునామా’ నవల స్వాతంత్ర్య సమరయోధుడి ఆలోచనా, త్యాగస్ఫూర్తిని గుండెను తాకేలా ఆవిష్కరిస్తుంది. విప్లవం ఆయుధాలతోనే కాదు, ఆలోచనలతోనూ సాగుతుందన్న సత్యాన్ని బలంగా చాటిందీ పుస్తకం. భగత్‌సింగ్ ఆశయాలు, సమాజ మార్పుపై ఆయన కలలు ప్రతి పుటలో ప్రతిధ్వనిస్తాయి. యువతను ఆలోచింపజేసే ఈ రచన, దేశభక్తికి కొత్త నిర్వచనం చెబుతుంది. పాఠకుడిని లోతైన ఆలోచనలోకి నెట్టే బాధ్యతాయుత రచన. అందరూ చదవాల్సిన నవల ఇది.

Similar News

News March 6, 2026

గచ్చిబౌలి: గ్యాస్‌ బెలూన్‌ పేలి నలుగురికి గాయాలు

image

గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్‌ శాంతి సరోవర్‌ ప్రాంగణంలో శుక్రవారం గ్యాస్‌ బెలూన్‌ పేలి నలుగురు గాయపడ్డారు. ఓ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన హీలియం బెలూన్‌ ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

News March 6, 2026

HYD: ఫైల్ కదలాలంటే సమర్పించుకోవాల్సిందే..!

image

సికింద్రాబాద్ GHMC ఆఫీసులో అకౌంట్స్ ఎగ్జామినర్ సంతోష్ ఓ పెన్షనర్ దగ్గర రూ.35వేలు లంచం తీసుకుంటూ ACBకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన విషయం తెలిసిందే. కాగా ఇది చిన్న శాంపిల్ మాత్రమే. ఇంజినీరింగ్ విభాగంలో 30శాతం కమీషన్ల దందా నడుస్తోందనే ఆరోపణలున్నా కేవలం చిన్న క్లర్కులను పట్టుకొని హడావిడి చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వందల కోట్ల ఆస్తులు వెనకేసిన పెద్ద ఆఫీసర్ల ఫైళ్లు మాత్రం బీరువాల్లోనే మగ్గుతున్నాయి.

News March 6, 2026

HYD: ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా.. జాగ్రత్త..!

image

HYDవాసులను జలమండలి బిల్లుల కంటే కేటుగాళ్ల మెసేజ్‌లే ఎక్కువ భయపెడుతున్నాయి. బిల్లు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తామంటూ HMWSSBపై ఫేక్ లింకులు పంపిస్తున్నారు. తెలీక ఆ లింక్ నొక్కితే అకౌంట్లు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే సిటీలో రూ.కోట్లు కాజేసినట్లు సమాచారం. డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు మాత్రం మేము అలాంటి మెసేజ్‌లే పంపమని చేతులు దులుపుకుంటున్నారు. కాగా, కస్టమర్ల వివరాలు బయటకెలా వెళ్తున్నాయో మాత్రం తెల్వట్లేదు.