News October 7, 2025
HYD: భద్రతపై యాక్షన్ ప్లాన్ రెడీ: కర్ణన్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ జారీతోనే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. హైదరాబాద్ నగర పోలీసులతో యాక్షన్ ప్లాన్ రెడీ అయిందని, ఎన్‌ఫోర్స్‌మెంట్ కోసం 9 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 9 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, 2 వీడియో సర్వేలెన్స్ టీమ్స్‌తో పాటు ఇతరత్రా టీమ్స్ ఉన్నాయని, అవసరాలకు అనుగుణంగా టీమ్స్ పెంచుతామన్నారు.
Similar News
News October 7, 2025
పార్వతీపురం నుంచి 30 ప్రత్యేక బస్సులు

విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర సందర్బంగా పార్వతీపురం జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు సేవలందిస్తున్నాయి. జిల్లా నుంచి 30 బస్సులు ఏర్పాటు చేసినట్లు RTC అధికారులు తెలిపారు. పార్వతీపురం డిపో నుంచి 10 బస్సులు, పాలకొండ నుంచి 12, సాలూరు డిపో నుంచి 8 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గతేడాది కంటే 6 బస్సులు అదనంగా ఏర్పాటు చేశామని మంగళవారం ఉదయం నుంచే సేవలందిస్తున్నాయన్నారు.
News October 7, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్..!

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నికతోపాటు తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం ఉండవల్లి నివాసంలో తెలంగాణ TDP కీలక నేతలతో సమావేశం అవుతున్నట్లు TDP వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో కార్యకలాపాలను పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా నియోజకవర్గాల నేతలతో సమావేశం అవుతున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు TDP ఎలాంటి వ్యూహం రచిస్తోందోననే ఆసక్తి నెలకొంది.