News June 6, 2024
HYD: భర్తను బెదిరించేందుకు ఆత్మహత్యాయత్నం

భర్తను బెదిరించేందుకు ఓ మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రాజేంద్రనగర్ PS పరిధి కిస్మత్పూర్‌లో సామెల్, గోవిందమ్మ నివాసం ఉంటున్నారు. సామెల్ మరో స్త్రీతో కనిపించినట్లు గోవిందమ్మతో ఓ మహిళ చెప్పింది. దీంతో గోవిందమ్మ ఆత్మహత్యాయత్నం చేయగా సామెల్ ఆసుపత్రికి తరలించాడు. కాగా సామెల్ గోవిందమ్మతో మాట్లాడిన మహిళపై దాడి చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
Similar News
News December 22, 2025
నేడు నెక్లెస్ రోడ్డులో ‘మాక్ డ్రిల్’

ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేలా సోమవారం నెక్లెస్ రోడ్ వ్యూ ప్రాంతంలో ‘మాక్ ఎక్సర్సైజ్’ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ డీఆర్ఓ వెంకటాచారి తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లో అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, హైడ్రా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. విపత్తు వేళ వివిధ శాఖలు సమన్వయంతో ఎలా స్పందించాలనే అంశంపై ఈ విన్యాసాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
News December 22, 2025
HYD: డిసెంబరులోనూ డెంగ్యూ పంజా.. జర భద్రం !

సాధారణంగా వర్షాకాలంలో భయపెట్టే డెంగ్యూ ఈసారి చలికాలంలోనూ వణుకు పుట్టిస్తోంది. డిసెంబరు నెలలోనూ డెంగ్యూ కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన 10 రోజుల్లో నగరంలో నాలుగుకు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్క నవంబరులోనే సుమారు 90కి పైగా డెంగ్యూ, వైరల్ జ్వరాల కేసులు ఫీవర్ ఆసుపత్రికి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలన్నారు.
News December 22, 2025
ఏటా పెరుగుతున్న GHMC బ్యాంక్ బ్యాలెన్స్

GHMC పరిధిలో వ్యాపారాలు చేసే వారు రోజు రోజుకూ పెరుగుతున్నారు. దీంతో ట్రేడ్ లైసెన్సులూ పెరుగుతున్నాయి. ఏటా అనుమతులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతుండటంతో GHMC ఖజానా ఢోకా లేకుండా పోయింది. ఈ ఏడాది ట్రేడ్ లైసెన్స్ ద్వారా రూ.112 కోట్లు వసూలైంది. అదే గతేడాదైతే రూ.94 కోట్లు, 2023లో రూ.81 కోట్లు, 2022లో రూ.72 కోట్లు వసూలైంది. ఇప్పుడిక విలీనంతో రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


