News December 23, 2025
HYD: భర్తలను బతకనివ్వరా?

సాఫీగా సాగుతున్న సంసారంలో అక్రమ సంబంధాలు అగ్గి రాజేస్తున్నాయి. ఉద్రేకంలో కొందరు, పరాయి మోజులో మరికొందరు భర్తలను కడతేరుస్తుండటం కలవరపెడుతున్నాయి. బోడుప్పల్‌లో 15 రోజుల వ్యవధిలోనే ఇద్దరు భర్తలు హతమయ్యారు. NOV 27న తాగి గొడవ చేస్తున్నాడని కొడుకు, మేనల్లుడితో కలిసి భర్త ప్రాణం తీసింది. తాజాగా పూర్ణిమ యువకుడి మోజులో భర్తను చున్నీతో చంపింది. దీనికి ముందు గండిపేట, షాద్‌నగర్‌లోనూ భర్తలను కిరాతకంగా చంపారు.
Similar News
News December 23, 2025
సంక్రాంతి సంబరాలు విజయవంతం చేయండి: కలెక్టర్

ఆత్రేయపురంలో జనవరి 11 నుంచి 13 వరకు కాటన్ ట్రోఫీ సంక్రాంతి సంబరాలు నిర్వహించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్ నుంచి మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు జరపాలని సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కొరత ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ సంబరాల నిర్వహణపై గ్రామస్థులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని కలెక్టర్ పేర్కొన్నారు.
News December 23, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: బండి సంజయ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో KCR, KTRకు <<18647212>>నోటీసులు<<>> ఇవ్వాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘కన్న బిడ్డ, అల్లుడి ఫోన్లనూ ట్యాప్ చేశారు. SIB వ్యవస్థను భ్రష్టు పట్టించారు. కాంట్రాక్టర్లు, లీడర్లను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటారా? దోషులను తేల్చుతారా? అనేది అనుమానమే. కేసును సాగదీస్తున్నారు’ అని పేర్కొన్నారు.
News December 23, 2025
3 నెలల్లో ₹75వేల కోట్ల ఆదాయ లక్ష్యం

TG: రానున్న 3 నెలల్లో సొంత పన్నుల ఆదాయం కింద ₹75వేల కోట్లు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. FY25-26లో ₹1.75 లక్షలCR లక్ష్యం కాగా ఇప్పటివరకు ₹లక్షCR వరకు సమకూరింది. 2026 MAR చివరి నాటికి తక్కిన మొత్తాన్ని సాధించేలా ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నులు, రవాణా శాఖలపై దృష్టి సారించింది. గతేడాది టార్గెట్లో 82% మాత్రమే సాధించింది. ఈ ఏడాది 95%కి పైగా సాధించాలని నిర్ణయించింది.


