News January 3, 2025
HYD: భారత జాగృతి ఆధ్వర్యంలో నేడు బీసీ సంఘాల సభ

భారత జాగృతి ఆధ్వర్యంలో నేడు HYDలో బీసీ సంఘాల సభ జరగనుంది. ఉదయం 11 నుంచి సా.4 గంటల వరకు ఇందిరాపార్క్ వద్ద BRS MLC కవిత సభను నిర్వహించనున్నారు. సభకు నిన్ననే పోలీస్ శాఖ అనుమతి ఇచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సభ నిర్వహించనున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సభలో ప్రధానంగా డిమాండ్ చేయనున్నారు.
Similar News
News July 5, 2025
HYD: వీకెండ్ స్పెషల్.. నేచర్ క్యాంప్

HYD శివారు మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్కులో వీకెండ్ స్పెషల్ ఎంజాయ్ చేసేందుకు సువర్ణ అవకాశం. నేటి సా.5 నుంచి ఆదివారం ఉ.9:30 వరకు నేచర్ క్యాంపు ఉంటుంది. టీం బిల్డింగ్, పిచ్చింగ్, రాత్రిపూట అడవిలో వాకింగ్, నైట్ క్యాంపింగ్, ఉదయం బర్డ్ వాచింగ్, ట్రేక్కింగ్ చేయొచ్చు. ఐదేళ్ల లోపు పిల్లలకు ఫ్రీ. మిగతా వారికి రూ.1,199 అని అధికారి రంజిత్ తెలిపారు. వివరాలకు 7382307476 నంబర్‌ను సంప్రదించండి.
News July 5, 2025
HYD: బోనాల జాతరకు వెళ్తున్నారా.. జాగ్రత్త!

HYDలో ఆషాఢ బోనాల జాతర కొనసాగుతోంది. భక్తుల రద్దీని అదునుగా భావిస్తోన్న కొందరు దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. బల్కంపేట ఎల్లమ్మ జాతరలోనూ వీరు రెచ్చిపోయారు. 12 గంటల్లోనే 19 కేసులు నమోదయ్యాయి. ఇందులో 13 సెల్‌ఫోన్ దొంగతనాలే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే క్యూ లైన్లలో నిలబడినప్పుడు, రద్దీ ప్రాంతాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
SHARE IT
News July 4, 2025
ట్యాంక్‌బండ్‌లో దూకిన మహిళ.. కాపాడిన యువకుడు

హుస్సేన్‌సాగర్‌లో దూకి ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. స్థానికుల వివరాలు.. రామంతాపూర్‌కు చెందిన మహిళ శుక్రవారం ట్యాంక్‌బండ్ మీదకు వచ్చింది. ఒక్కసారిగా నీటిలో దూకేసింది. ఇది గమనించిక ట్యాంక్‌బండ్ శివ కుమారుడు హుస్సేన్‌సాగర్‌లోకి దిగారు. నీటిలో మునుగుతున్న ఆమెను బ్లూ కోట్ పోలీసుల సాయంతో ఒడ్డుకు తీసుకొచ్చి ప్రాణాలు కాపాడాడు. మహిళ సూసైడ్ అటెంప్ట్‌కు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.