News January 26, 2025

HYD: భారీగా తగ్గిన టమాటా ధరలు

image

టమాటా ధరలు మునుపెన్నడూ లేని విధంగా పడిపోయాయి. జంట నగరాల అవసరాలకు సరిపడా టమాట ఉత్పత్తి పెరగడంతో ప్రస్తుతం గుడిమల్కాపూర్, ఎల్బీనగర్, బోయిన్‌పల్లి, మాదన్నపేట మార్కెట్లలో టమాటా ధరలు భారీగా తగ్గాయి. హోల్ సేల్ మార్కెట్లో కిలో రూ.3 నుంచి రూ.8 వరకు ఉండగా.. రిటైల్ మార్కెట్లో కిలో రూ.7 నుంచి రూ.10 వరకు పలుకుతోంది. మీ ప్రాంతంలో ఎంతకు విక్రయిస్తున్నారు.

Similar News

News November 3, 2025

సికింద్రాబాద్: ఉజ్జయిని మహకాంళిని దర్శించుకున్న కలెక్టర్

image

కార్తీక మాసం రెండో సోమవారం కావడంతో సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయాన్ని డీసీపీ రష్మిక పెరుమాళ్, జిల్లా కలెక్టర్ హరిచందన దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఈవో మనోహర్ రెడ్డి, అర్చకులు కలెక్టర్‌కి ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారికి కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అద్దాల మండపం వద్ద దీపాలంకరణ కార్యక్రమంలో మహిళా భక్తులతో కలిసి దీపాలను వెలిగించారు.

News November 3, 2025

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు తెలంగాణ జన సమితి సంపూర్ణ మద్దతు ప్రకటన

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు తెలంగాణ జన సమితి సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ చీఫ్ కోదండరాం తెలిపారు. షేక్‌పేట్‌ పరిధి ఓయూ కాలనీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రులు వివేక్, అజహరుద్దీన్‌తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలంగాణ జన సమితి మద్దతు కోరారని, ఇందులో భాగంగా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు.

News November 3, 2025

గ్రేటర్ హైదరాబాద్ PDSU నూతన కమిటీ ఎన్నిక

image

PDSU గ్రేటర్ హైదరాబాద్ జిల్లా నూతన కమిటీని ఈరోజు ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా రాకేశ్, ప్రధాన కార్యదర్శిగా హరీశ్, ఉపాధ్యక్షులుగా నాగరాజు, నవీన్, రత్నాశేఖర్, సహాయ కార్యదర్శులుగా, సాయిప్రసాద్, దీక్షిత, శివ, సోషల్ మీడియా కన్వీనర్లుగా అనిల్, అభిరామ్, 24 మంది సిటీ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.