News January 7, 2025
HYD: భారీగా పట్టుబడ్డ నకిలీ పన్నీరు
హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిసరి ఎంక్లేవ్‌లో నకిలీ పన్నీరు భారీ మొత్తంలో పట్టుబడింది. విశ్వసనీయ సమాచారంతో నకిలీ పన్నీరు తయారు కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేపట్టారు. నిందితులను పట్టుకొని అల్వాల్ పోలీసులకు అప్పగించారు. అక్కడ సుమారు 600 కిలోల పన్నీరు, కొన్ని రకాల కెమికల్స్ సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బేగం బజార్‌కు చెందిన ఓ వ్యాపారి దీన్ని నిర్వహిస్తున్నట్టు సమాచారం.
Similar News
News January 8, 2025
HYDలో ఒకేసారి పూసిన 92 పువ్వులు
అరుదుగా కనిపించే బ్రహ్మ కమలాలు ఒకేసారి 92 వికసించాయి. మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడలోని ధనలక్ష్మి రమణమూర్తి ఇంట్లో చెట్టుకు ఈ అద్భుతం జరిగింది. ఒకే రోజు పదుల సంఖ్యలో పూలు పూయడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఏడాదికి ఒకేసారి పూసే బ్రహ్మకమలాలు విరివిగా పూయడం విశేషం.
News January 8, 2025
చర్లపల్లి టెర్మినల్ ఓపెన్.. మరి రోడ్లు?
చర్లపల్లి టెర్మినల్ అత్యాధునిక హంగులతో ప్రారంభమైంది. స్టేషన్‌కు వెళ్లే రోడ్లను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికుల అభిప్రాయం. సిటీ నుంచి వచ్చే వారు హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ మీదుగా స్టేషన్‌కు చేరుకోవచ్చు. కీసర, మేడ్చల్, ECIL వాసులు రాంపల్లి మీదుగా వస్తారు. ప్రస్తుతం ఈ రహదారులు బాగానే ఉన్నాయి. ప్రయాణికుల రద్దీ పెరిగితే రోడ్లను విస్తరించాల్సిందేనా..? దీనిపై మీ కామెంట్?
News January 7, 2025
HYD: నుమాయిష్‌కు వెళుతున్నారా? నేడు లేడీస్ డే..!
84వ నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో మంగళవారం లేడీస్ డే నిర్వహిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు కే.నిరంజన్, కార్యదర్శి సురేందర్ రెడ్డి వెల్లడించారు. ఎగ్జిబిషన్ మంగళవారం కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు. మహిళలకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. ఉమెన్స్ స్పెషల్ డే ప్రోగ్రామ్‌కు రాష్ట్ర జైళ్ల శాఖ ఐజీ డాక్టర్ సౌమ్య మిశ్రా పాల్గొంటున్నట్లు తెలిపారు.