News April 8, 2024

HYD: భారీగా పెరిగిన చికెన్ ధరలు

image

HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా చికెన్ ధర ప్రస్తుతం రూ.294 పలుకుతోంది. వారంలోనే ఏకంగా రూ.50 పెరగడంతో మధ్య తరగతి వాళ్లు కొనేందుకు వెనకాడుతున్నారు. వేసవి కావడంతో అధిక ఉష్ణోగ్రతకు కోళ్లు చనిపోతుంటాయి. దీనికి తోడు పెళ్లిళ్లు, రంజాన్ నేపథ్యంలో ఎక్కువగా చికెన్ వాడటం వల్ల డిమాండ్ పెరిగింది. మరో వారంలో చికెన్ ధర రూ.350 వరకు పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్థులు తెలిపారు.

Similar News

News September 30, 2024

HYD: మూసీ వద్ద మార్కింగ్, సర్వేకు హైడ్రాకు సంబంధం లేదు: రంగనాథ్

image

HYD: మూసీ న‌దికి ఇరువైపులా స‌ర్వేల‌తో హైడ్రాకు సంబంధం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. అక్క‌డి నివాసితుల‌ను హైడ్రా త‌ర‌లించ‌డంలేదని, అక్క‌డ ఎలాంటి కూల్చివేత‌లు హైడ్రా చేప‌ట్ట‌డంలేదన్నారు. మూసీ ప‌రీవాహ‌క ప్రాంతంలోని ఇళ్ల‌పై హైడ్రా మార్కింగ్ చేయ‌డంలేదని, మూసీ సుంద‌రీక‌ర‌ణ ప్ర‌త్యేక ప్రాజెక్టని తెలిపారు. దీనిని మూసి రివ‌ర్‌ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చేప‌డుతోందని ప్రకటించారు.

News September 30, 2024

HYD: మూసీ నిర్వాసితులపై BRS మొసలి కన్నీళ్లు: మంత్రి

image

మూసీ నిర్వాసితులపై బీఆర్ఎస్ వాళ్లు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. హైడ్రా అంశాన్ని బీఆర్ఎస్ భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. గతంలో రైతు సోదరులపై బుల్డోజర్లు పంపించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మండిపడ్డారు. మూసీ నిర్వాసితులకు తాము అండగా ఉంటామని, HYDను బెస్ట్ సిటీగా మారుస్తామని స్పష్టం చేశారు.

News September 30, 2024

HYD: మార్పు చెందకపోతే మనుగడ కష్టమే: ఇస్రో ఛైర్మన్

image

HYD బాలనగర్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(NRSC) ప్రపంచ వ్యాప్తంగా అనేక సేవలు అందించినట్లు ISRO ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తోన్న మార్పులకు అనుగుణంగా మారకపోతే రిమోట్ సెన్సింగ్ మనుగడ కష్టమేనన్నారు. సాంకేతికతలో వేగంగా మార్పులు వస్తున్నాయని, సమాచారం అత్యంత వేగంగా కావాలని ప్రజలు, వ్యవస్థలు కోరుకుంటున్నాయన్నారు. రాబోయే 25 ఏళ్లకు వచ్చే మార్పులను అంచనా వేసి నివేదిక రూపొందించాలన్నారు.