News August 27, 2025

HYD: భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లు రద్దు

image

భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నేడు పలు రైళ్లు రద్దు చేసింది. నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను రద్ద అయింది. మెదక్ – కాచిగూడ రైలు నేడు పాక్షికంగా రద్దు చేశారు. హైదరాబాద్ రైల్వే డివిజన్‌లోని భిక్నూర్ – తల్మడ్ల సెక్షన్, అకన్నపేట్ – మెదక్ సెక్షన్‌లో ట్రాక్‌లపై వరద నీరు పొంగిపొర్లుతుంది.

Similar News

News August 27, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లా వర్షపాతం నమోదు వివరాలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు బుధవారం సాయంత్రం ఇలా ఉన్నాయి. ఇల్లంతకుంట 132, గంభీరావుపేట 92.5, ఎల్లారెడ్డిపేట 40, తంగళ్ళపల్లి 31.3, సిరిసిల్ల 20.5, ముస్తాబాద్ 20, కొన్నారావుపేట 14.5, వీర్నపల్లి 11.5, రుద్రంగి 7.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇల్లంతకుంటలో ఎక్కువగా, రుద్రంగిలో తక్కువగా వర్షపాతం నమోదయింది.

News August 27, 2025

KTRపై Dy.CM భట్టి విక్రమార్క ఫైర్

image

TG: వరద సహాయక చర్యలపై <<17533837>>KTR<<>> అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని Dy.CM భట్టి విక్రమార్క మండిపడ్డారు. ‘ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది. వాళ్లలాగా ఇంట్లో కూర్చోలేదు. పరిస్థితిని ఎప్పటికప్పుడు CM ఆరా తీస్తున్నారు. నిన్న బిహార్ వెళ్లి సాయంత్రానికే తిరిగొచ్చారు’ అని తెలిపారు. వరదలు వస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని KTR విమర్శించిన సంగతి తెలిసిందే.

News August 27, 2025

మిడ్ మానేరు ప్రాజెక్టులోకి భారీగా చేరుతున్న వరద నీరు

image

బోయినపల్లి మండలం మిడ్ మానేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మానేరు వాగుతో పాటు ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ద్వారా నీటి ప్రవాహం సైతం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి బుధవారం సాయంత్రం వరకు 25300 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ఎస్సారెస్పీ నుంచి వరద కాలువ ద్వారా 16365, గాయత్రి పంప్ హౌస్ నుంచి 3150, మానేరు, ములవాగు వాగు నుంచి 5785 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.