News December 23, 2025

HYD: భార్యే.. ప్రియుడితో కలిసి చంపేసింది!

image

HYDలో ఇటీవల జరిగిన ఘటనలతో మానవ సంబంధాలు ప్రశ్నార్థకం అవుతున్నాయి. తాత్కాలిక ఆనందం కోసం పూర్ణిమ నూరేళ్ల దాంపత్య జీవితాన్ని బలిచేసుకుంది. భార్యాభర్తలు పూర్ణిమ(36), అశోక్‌(45) బోడుప్పల్‌లో నివసిస్తున్నారు. ఆమెకు మహేశ్(22)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. అడ్డుగా ఉన్నాడని భర్తను మహేశ్ అతడి ఫ్రెండ్ సాయితో కలిసి చున్నీ మెడకు బిగించి హత్య చేసింది. దర్యాప్తు అనంతరం ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు.

Similar News

News December 26, 2025

తిరుపతి: గతంలో BVSలు ఎక్కడ జరిగాయంటే..?

image

సంప్రదాయ విజ్ఞానాన్ని, ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేయడంతో సమకాలిన సమాజానికి జరిగే మేలును దేశానికి చాటి చెప్పే కార్యక్రమం భారతీయ విజ్ఞాన సమ్మేళనం(BVS). 2007లో భోపాల్‌లో ప్రారంభించారు. 2009లో ఇండోర్, 2012లో జలంధర్, 2015లో పనాజీ, 2017లో పుణే, 2023లో అహ్మదాబాద్‌లో జరిగాయి. తొలిసారి తిరుపతి వేదికగా ఇవాళ BVS నిర్వహించనున్నారు.

News December 26, 2025

యశ్ దయాల్ స్థానంలో ఉమేశ్ యాదవ్?

image

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న RCB బౌలర్ యశ్ దయాల్ స్థానంలో IND సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్‌ను వచ్చే సీజన్‌లో జట్టులోకి తీసుకోనున్నట్లు క్రీడావర్గాల్లో చర్చ జరుగుతోంది. పోక్సో కేసు నమోదైన యశ్‌ను జట్టులో ఎలా కొనసాగిస్తారని RCBపై విమర్శలొస్తున్నాయి. తాజాగా అతని ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరణకు గురైంది. దీంతో ఉమేశ్‌ను తీసుకోనున్నారనే ప్రచారం ఊపందుకుంది. దీనిపై RCB నుంచి అధికారిక ప్రకటన రాలేదు.

News December 26, 2025

సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు: బీసీ జనార్దన్

image

AP: రాష్ట్రంలోని రోడ్లను సంక్రాంతి నాటికి గుంతల రహితంగా తీర్చిదిద్దాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పలు జిల్లాల ఆర్&బి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో రోడ్ల పరిస్థితి, జరుగుతున్న పనులపై ఆరా తీశారు. గతేడాది సంక్రాంతికి పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన ప్రజలు, స్థానికులు రహదారులు మెరుగుపడటంపై సంతోషం వ్యక్తం చేశారని ఆయన తెలిపారు.