News September 14, 2025
HYD: భార్య గొంతుకోసిన భర్త.. ఆస్పత్రికి తరలింపు

నాగోల్‌లో భార్య మహాలక్ష్మి గొంతును భర్త వేణుగోపాల్ కత్తితో కోశాడు. దీంతో ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఏడాది క్రితం మహాలక్ష్మితో వివాహం జరగగా.. అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చిన అతడు మారకపోగా.. ఈరోజు ఘాతుకానికి ఒడిగట్టాడు. కాగా, వేణుగోపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 14, 2025
ములుగు: బుల్లెట్ బండిపై SP, మంత్రి సీతక్క..!

మంత్రిననే హోదాను పక్కనబెట్టి సాధారణ వ్యక్తిగా వ్యవహరించడం సీతక్క నైజం. ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే ఆమె ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. ఆదివారం మేడారం జాతర పనుల పర్యవేక్షణకు వెళ్లిన మంత్రి ములుగు SP శబరీష్ బుల్లెట్ బైక్ నడుపుతుండగా వెనుక కూర్చొని జాతర జరిగే పరిసరాలను పరిశీలించారు. రోడ్లు, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ ఏర్పాట్లపై సమీక్షించారు. జాతర నిర్వహణకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
News September 14, 2025
ఇతర భాషలకు హిందీ శత్రువు కాదు.. మిత్రుడు: అమిత్ షా

దేశంలో హిందీ భాషను ఇతర భాషలకు ముప్పుగా చూడొద్దని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హిందీ ఇతర భాషలకు శత్రువు కాదని, మిత్రుడు అని హిందీ దివస్ కార్యక్రమంలో ఆయన చెప్పారు. ‘ఇందుకు గుజరాత్ పెద్ద ఉదాహరణ. ఇక్కడ గుజరాతీ మాట్లాడిన గాంధీ, దయానంద, వల్లభాయ్ పటేల్, KM మున్షి వంటి ఉద్ధండులు హిందీని ప్రోత్సహించారు. వందేమాతరం, జైహింద్ లాంటి నినాదాలు భాషా మేల్కొలుపు నుంచే ఉద్భవించాయి’ అని వ్యాఖ్యానించారు.
News September 14, 2025
BHPL: కారులో పాము.. తృటిలో తప్పిన ప్రమాదం

భూపాలపల్లి అంబేడ్కర్ సెంటర్ వద్ద ఓ కారులో పాము కలకలం సృష్టించింది. కారు డోర్ తీసి చూడగా వింత శబ్దాలు రావడంతో యజమాని లోపల పామును చూసి భయాందోళనకు గురయ్యాడు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వగా, అతడు వచ్చి పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.