News March 22, 2025

HYD: భార్య వీడియోలు భర్తకు పంపి.. బ్లాక్ మెయిల్!

image

విదేశంలో HYD యువతికి వేధింపులు ఎదురయ్యాయి. శ్రీకృష్ణానగర్‌ వాసి 2018లో పనికోసం దుబాయ్‌కు వెళ్లింది. అక్కడ పరిచయమైన అబూబాకర్ ఆమె వ్యక్తిగత వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. 2020లో బాధితురాలు HYD వచ్చేసింది. అయినా అతడి వేధింపులు ఆగలేదు. ఏకంగా ఆమె ఇంటి వద్దకు వచ్చాడు. కాల్ చేసినా ఆమె బయటకురావడం లేదని ఆ వీడియోలు ఆమె భర్తకు పంపాడు. ఈ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News March 22, 2025

BHPL: అటవీ భూముల కేటాయింపుపై సమీక్ష

image

 చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన అటవీ భూముల కేటాయింపుపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం ఐడీఓసీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అటవీ, రెవెన్యూ, సర్వే, ఆర్అండ్‌‌బీ, మెగా ప్రాజెక్టు అధికారులకు అవసరమైన భూముల కేటాయింపునకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News March 22, 2025

25 ఏళ్ల వరకూ డీలిమిటేషన్ ఉండొద్దు: స్టాలిన్

image

తమిళనాడు CM స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో డీలిమిటేషన్‌పై జరిగిన అఖిలపక్ష సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. అనంతరం స్టాలిన్ మాట్లాడారు. ‘25 ఏళ్ల వరకూ నియోజకవర్గాల పునర్విభజన చేయకూడదని తీర్మానించాం. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తెలంగాణలో రెండో సమావేశం ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. కొన్ని కారణాల వల్ల TMC హాజరు కాలేదు. జగన్ కూడా మా వెంటే ఉన్నట్లు భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

News March 22, 2025

విశాఖ: కళాకారులకు జిల్లాస్థాయి అవార్డులు

image

విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో విశాఖ జిల్లాలో అత్యంత ప్రతిభ కనబరిచిన కళాకారులను ఆదివారం కళా ప్రవీణ 2025 పురస్కారాలతో సత్కరిస్తున్నట్లు సంఘం గౌరవ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, కే జనార్ధన్ పేర్కొన్నారు. శనివారం వారు మహారానిపేటలో విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా నుంచి గుర్తింపు పొందిన కళాకారులను ఎంపిక చేసి స్థానిక కళ్యాణ మండపంలో అవార్డులు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!