News January 14, 2026
HYD: భూగర్భజలాలు పాతాళానికి

భారీ వర్షాలు కురిసినా బల్దియాలోని భూగర్భజలాలు పడిపోతున్నాయి. నిరుడితో పోలిస్తే నీటిమట్టం 2-3 అడుగుల దిగువకు జారిందని అధికార గణాంకాలు చెబుతున్నాయి. GHMC పరిధిలోని 46 మండలాల్లో 13 మండలాలు రెడ్‌జోన్‌లోకి వెళ్లాయి. కాంక్రీటీకరణతో వర్షపు నీరు భూమిలోకి ఇంకకపోవడం ప్రధాన కారణం. బోర్లు అడుగంటడంతో వేసవిలో నగర, శివారువాసులకు నీటి ఎద్దడి తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంకుడు గుంతల ఆవశ్యకత గుర్తుచేస్తున్నాయి.
Similar News
News February 11, 2026
పురపోరు: కొడంగల్ వైపు ‘ఉమ్మడి’ చూపు!

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందడి తుది దశకు చేరింది. నేడు 7AM గంటల నుంచి పోలింగ్ మొదలుకానుంది. రంగారెడ్డిలో 6, వికారాబాద్‌లో 4, మేడ్చల్‌లో 3 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల తరఫున CM, మంత్రులు, MP, MLAలు హోరాహోరీగా ప్రచారం చేశారు. ఇక పుర ప్రజలను మెప్పించిన నాయకుడు ఎవరనేది ఎల్లుండి కౌంటింగ్‌లో తేలనుంది. CM ఇలాకాలో ఓటరు నాడి ఎటనేది ఆసక్తిగా మారింది.
News February 11, 2026
HYD: లైసెన్స్ లేకుండా బండి నడుపుతున్నారా?

మార్చి 1, 2026 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇక మీదట నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిరంతర ప్రత్యేక డ్రైవ్‌లను నిర్వహించనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులు RTA నుంచి తీసుకోవాలని సూచించారు. లైసెన్స్ లేని డ్రైవర్లతోనే ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. బైక్ ఓనర్ లైసెన్స్ లేని వారికి వాహనం ఇచ్చినా నేరమేనని పోలీసులు హెచ్చరించారు.
News February 10, 2026
HYD: దోమలు నిద్రపోనివ్వడం లేదు!

సిటీలో IT అంటే సాఫ్ట్‌వేర్ అనుకుంటే పొరపాటే.. ఇప్పుడు అది ‘ఇంటెన్సివ్ టెర్రర్’గా మారింది. మణికొండ, నార్సింగి ప్రాంతాల్లో దోమల దండయాత్ర మామూలుగా లేదు. 2024లో ఇక్కడి గేటెడ్ కమ్యూనిటీలు ప్రైవేట్ ఫాగింగ్ కోసం నెలకు లక్షన్నర ఖర్చు చేస్తే ఇప్పుడు మూడున్నర లక్షలకు చేరింది. పేరుకే హైటెక్ సిటీ కానీ.. పక్కనే ఉన్న ఖాళీ ప్లాట్లు దోమల ఫ్యాక్టరీలుగా మారాయి. మున్సిపల్ మందులకు ఈ దోమలు చావట్లేదట మరి!


