News February 15, 2025
HYD: మంచినీటి సరఫరా.. మూడంచెల్లో క్లోరినేషన్!

జలమండలి నీటిని మూడంచెల్లో క్లోరినేషన్ చేస్తుందని HYDలో ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. మొదటి దశలో నీటి శుద్ధి కేంద్రాలు, రెండో దశలో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, చివరగా సర్వీస్ రిజర్వాయర్ల వద్ద బూస్టర్ క్లోరినేషన్ చేస్తుంది. దీంతో పాటు ప్రజలకు సరఫరా చేసే నీటిలో కచ్చితంగా 0.5 పీపీఎం క్లోరిన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు.
Similar News
News November 4, 2025
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కమిటీ

TG: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ సంస్కరణలకు ప్రభుత్వం కమిటీని నియమించింది. స్పెషల్ సీఎస్ ఛైర్మన్‌గా, ప్రిన్సిపల్ సెక్రటరీ వైస్ ఛైర్మన్‌గా 15 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కాలేజీ యాజమాన్యాల నుంచి ముగ్గురికి, ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, కోదండరామ్‌కు చోటు కల్పించింది. రీయింబర్స్‌మెంట్ విధానంపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. తీసుకోవాల్సిన చర్యలపై 3 నెలల్లో తమ రిపోర్టును ప్రభుత్వానికి అందజేయనుంది.
News November 4, 2025
VZM: విజేతలను అభినందించిన ఎస్పీ

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలైన విద్యార్థులు, ఉద్యోగులను తన కార్యాలయంలో SP దామోదర్ అభినందించారు. ప్రథమ బహుమతిగా రూ.2వేలు, ద్వితీయ బహుమతిగా రూ.1500, తృతీయంగా రూ.1000 చొప్పున నగదు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు గుడ్ టచ్-బ్యాడ్ టచ్ పై అవగాహన పెంపొందించుకోవాలని, ఏదైనా ఇబ్బంది ఉంటే ఇంట్లో పెద్దలకు చెప్పాలని సూచించారు.
News November 4, 2025
గిరిజన గూడెంలోని అందరికీ గ్యాస్ కనెక్షన్లు అందించాలి: కలెక్టర్

నంద్యాల జిల్లాలో పీఎం ఉజ్వల యోజన కింద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, గిరిజన గూడెంలోని అందరికీ గ్యాస్ కనెక్షన్లు అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భైర్లూటి గూడెం, గులాం అలియాబాద్ తాండాలలో ఏర్పాటైన నైపుణ్య కేంద్రాల ద్వారా యువతకు ఉపాధి కల్పించాలన్నారు. వసతి గృహాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.


