News September 3, 2025
HYD: మంచి నీళ్ల కోసం మహిళల నిరసన

మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని 16, 17వ వార్డుల్లో తాగునీరు సరఫరా కావడం లేదని ఆ బస్తీ మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల తమ పంచాయతీ మున్సిపాలిటీలో విలీనమైందని, అయితే గ్రామ పంచాయతీ హయాంలో వేసిన పైప్‌లైన్ కావడంతో వారానికి ఒకసారి చాలీచాలని బోరు నీటిని వదలడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News September 4, 2025
HYD: రూ.292 కోట్లు అప్పగించాం: శిఖా గోయల్

సైబర్ నేరాల్లో డబ్బు పోగొట్టుకున్న బాధితులకు గతేడాది రూ.292 కోట్లు రికవరీ చేసి అప్పగించామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. సోమాజిగూడలోని ఓ హోటల్‌లో సైబర్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అప్రమత్తతతోనే సైబర్ నేరాల నియంత్రణ సాధ్యమన్నారు. ఇప్పటివరకు 43,000 సిమ్‌లు, 14,000 IMEIలు, 8,000 URLలు బ్లాక్ చేశామన్నారు.
News September 4, 2025
HYD: సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు

సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు HYD నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ సంస్థ డైరెక్టర్ డా.విమలారెడ్డి తెలిపారు. కోర్సుల్లో చేరడానికి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, డిప్లొమా అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 19వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.
# SHARE IT
News September 4, 2025
బల్కంపేట ఎల్లమ్మ ఆలయ హుండీ ఆదాయం ఎంతంటే?

బల్కంపేట ఎల్లమ్మ ఆలయం హుండీలను అధికారులు లెక్కించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. హుండీల ద్వారా రూ.86.39 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. అన్నదానానికి రూ.1,81,734 వచ్చాయన్నారు. 122 అమెరికా డాలర్లు, ఒక మలేషియా, 15 కథార్, ఒక యూరో, యూఏఈ, 65 చైనా, ఒక బెహరిన్ కరెన్సీ, మిక్స్‌డ్ బంగారం, వెండి ఆభరణాలను భక్తులు సమర్పించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.