News February 8, 2025

HYD: మంత్రికి TWJF ప్రతినిధుల వినతిపత్రం

image

HYDలోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రి దామోదరరాజనర్సింహను TWJF ప్రతినిధుల బృందం కలిశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందించారు. హెల్త్ కార్డులు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నా.. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పట్టించుకోవడంలేదని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

Similar News

News February 8, 2025

1200 ఓట్ల వెనుకంజలో అరవింద్ కేజ్రీవాల్

image

న్యూఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీ వైపు గాలి వీస్తోంది. ఒక్కో రౌండు లెక్కింపు ముగిసే కొద్దీ ఆమ్‌ఆద్మీ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. 9 రౌండ్లు ముగిసే సరికి అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడ 1200 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. మరోవైపు కల్కాజీలో సీఎం ఆతిశీ మార్గేనా 3231 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఇక ఢిల్లీ రాష్ట్రంలో బీజేపీ 45, ఆప్ 25 సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.

News February 8, 2025

వరంగల్ ఇన్‌ఛార్జి డీటీఓగా శోభన్ బాబు

image

వరంగల్ జిల్లా రవాణా శాఖ కార్యాలయ ప్రక్షాళనపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. నిన్న డీటీసీ శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ దాడులు, అరెస్టు తర్వాత మరో అధికారిపై వేటు వేశారు. వరంగల్ డీటీఓ లక్ష్మిపై బదిలీ ప్రభుత్వం వేటు వేసిన తెలిసిందే. కాగా ఎంవీఐ శోభన్ బాబును వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News February 8, 2025

BREAKING: కామారెడ్డి జిల్లాలో తప్పిన భారీ ప్రమాదం

image

KMRజిల్లాలో ఈరోజు భారీ ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాలు.. KMRడిపోకు చెందిన RTCబస్సు భద్రాచలం వెళ్తుండగా మార్గమధ్యలో మాచారెడ్డి బస్టాండ్ వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో అది వైర్లతో సహా రోడ్డుపై పడింది. ప్రయాణికులు భయపడి బస్సు దిగి పరుగులు తీశారు. వైర్లు ఏ మాత్రం బస్సుపై పడినా భారీ ప్రమాదం జరిగి ఉండేది. వెంటనే కరెంట్ కట్ అవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

error: Content is protected !!