News October 19, 2025

HYD: మంత్రి పేషీ అడ్డాగా ఐటీ ప్రాజెక్ట్‌ పేరుతో మోసం

image

సచివాలయం ఐటీ మంత్రి పేచీ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మంత్రి పేషీని అడ్డాగా చేసుకొని ఐటీ ప్రాజెక్ట్‌ మంజూరు చేస్తామంటూ మోసం చేశారు. మియాపూర్‌ ఐటీ ఇంజినీర్‌ను లక్ష్యంగా చేసుకుని నకిలీ పత్రాలతో రూ.1.77 కోట్లు కాజేశారు. మంత్రి ఓఎస్‌డీ లెటర్‌హెడ్‌లు, నకిలీ పత్రాలు చూపి మోసగాళ్లు నమ్మించారు. బాధితుడి ఫిర్యాదుతో ఆరిగురిపై సైఫాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణను సీసీఎస్‌కు బదిలీ చేశారు.

Similar News

News October 19, 2025

HYD: వేపను వెంటాడుతున్న వైరస్!

image

పచ్చటి ఆకులతో కళకళలాడాల్సిన వేపచెట్లను HYD శివారులో వైరస్ వెంటాడుతోంది. సర్వరోగ నివారిణిగా పిలిచే ఈ చెట్లను మాయదారి రోగం పట్టిపీడిస్తోంది. శీతాకాలం ఆరంభంలో చెట్ల ఆకులపై మంచు కురిసి కనులకు ఇంపుగా కనిపించాల్సింది పోయి, ఆకులు కాలినట్లుగా మారి ఎండిపోతున్నాయి. క్రమంగా మోడువారుతున్నాయి. ప్రతాప సింగారంలో 4 ఏళ్లలో ఈ వైరస్ సోకడం ఇది మూడోసారి అని స్థానికులు తెలిపారు.

News October 19, 2025

జూబ్లీహిల్స్ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో దానం పేరు

image

జూబ్లీహిల్స్ బైపోల్‌కు ముందు MLA పార్టీ ఫిరాయింపుల చర్చ తెరమీదకు వచ్చింది. BRS నుంచి గెలిచి పార్టీ మారిన MLA దానం నాగేందర్ పేరు కాంగ్రెస్ స్టార్ క్యాపెయినర్స్ లిస్టులో ఉంది. ఓవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుండగానే విడుదలైన ఈ జాబితా రాజకీయంగా చర్చనీయాంశమైంది. గతంలో ఆయన ఈ సెగ్మెంట్ నుంచి పోటీచేస్తారనే ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఆయన ప్రచారానికి వస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.

News October 19, 2025

జూబ్లీ బైపోల్: ఇప్పటికి 127.. ఉన్నది ఒక్కరోజే!

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్లు జోరందుకున్నాయి. అధికారులు ఊహించని విధంగా నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకు 127 మంది పోటీచేస్తామంటూ ముందుకువచ్చారు. నామినేషన్లు వేసేందుకు తుది గడువు 3 రోజుల (21వ తేదీ వరకు) సమయమున్నా.. ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉంది. 19 ఆదివారం, 20న దీపావళి కావడంతో మంగళవారం ఆఖరి రోజు. ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి నామినేషన్ వేస్తామని పలువురు ప్రకటించడంతో దీనిపై ఆసక్తి నెలకొంది.