News November 13, 2024
HYD: మంత్రి పొంగులేటితో ముఖాముఖి

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించేందుకే మంత్రులతో ముఖాముఖి ఏర్పాటు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను, వినతులను స్వీకరించారు. వెంటనే ఆయా అధికారులకు సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.
Similar News
News February 23, 2026
బంజారాహిల్స్‌లో ర్యాపిడో బైక్‌ను ఢీ కొట్టిన ట్యాంకర్.. ఇద్దరి మృతి

బంజారాహిల్స్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న వాటర్ ట్యాంకర్ ర్యాపిడో బైక్‌ను వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న రైడర్ (హోంగార్డ్), అతని వెనక కూర్చున్న యువతి అక్కడికక్కడే మృతి చెందారు. యువతిని పిక్ చేసుకున్న కొన్ని నిమిషాలకే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
News February 23, 2026
HYD: పేదల ఇళ్ల కూల్చివేతలపై UDF ధ్వజం..!

మూసీ ప్రక్షాళన ముసుగులో పేదల ఇళ్లను కూల్చడం అన్యాయమని అర్బన్ డెవలప్‌మెంట్ ఫోరం మండిపడింది. దశాబ్దాలుగా ఉంటోన్న వారిని బఫర్ జోన్ పేరుతో రోడ్డున పడేయడం ఏంటని ప్రశ్నించింది. DPR సిద్ధం కాకుండానే తొలగింపులు చేపట్టడం బాధ్యతారాహిత్యమని కన్వీనర్ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. రియల్ ఎస్టేట్, టూరిజం బిజినెస్ కోసం సామాన్యుల గూళ్లు కూల్చొద్దని, నదిని మాత్రమే శుద్ధి చేయాలని కోరారు. తక్షణమే కూల్చివేతలను ఆపాలన్నారు.
News February 23, 2026
HYD: ఇకపై అలాంటివారిని పట్టిస్తే రూ.200/-

మీ వీధిలో ఎవరైనా మోటారు పెట్టి సంపులు పొంగిస్తున్నారా? పైపు లీకేజీని పట్టించుకోకుండా వదిలేస్తున్నారా? అయితే వెంటనే అలర్ట్ అవ్వండి. మార్చి మొదటి వారం నుంచి HMWSSB అందుబాటులోకి తెస్తున్న ‘పానీ యాప్’ ద్వారా నీటి వృథాను ఫొటో తీసి అప్‌లోడ్ చేయండి. అధికారులు IP అడ్రస్ ద్వారా నిందితులను గుర్తించి వెంటనే జరిమానా విధిస్తారు. ఇలా నీటిని ఆదా చేసినందుకు మీకు రూ.200ల నగదు ప్రోత్సాహకం కూడా లభిస్తుంది.


