News March 19, 2025
HYD: మంత్రి సీతక్క పేరుతో నకిలీ MLA స్టిక్కర్

హైదరాబాద్ నకిలీ MLA స్టిక్కర్ వేసుకొని సంచరిస్తున్నారు. తాజాగా మంత్రి సీతక్క పేరుతో ఉన్న నకిలీ స్టిక్కర్ వాహనం (TG 09 HT R 1991)THARపై చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీసులకు బుధవారం ఫిర్యాదు అందింది. మంత్రి పీఆర్ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కార్ సీజ్ చేసినట్లు పంజాగుట్ట పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 19, 2025
మరింత బాధ్యతగా పని చేసేలా జనసేన అడుగులు: పవన్

AP: పిఠాపురం చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆ పార్టీ అధినేత, Dy.CM పవన్ ధన్యవాదాలు తెలిపారు. ‘రానున్న రోజుల్లో ఇంకా బలమైన పార్టీగా జనసేన మారుతుంది. సామాన్యుల గొంతుకగా, రాష్ట్ర ప్రయోజనాలు, జాతీయ ఐక్యత లక్ష్యంగా మరింత బాధ్యతగా పని చేసే దిశగా అడుగులు వేయనుంది. పార్టీ బలోపేతం కోసం జనసేన శ్రేణులు ప్రజల పక్షాన నిలబడి పని చేయాలి’ అని పవన్ ట్వీట్ చేశారు.
News March 19, 2025
MBNR: పదేళ్లలో BRSది విధ్వంస పాలన: మంత్రి జూపల్లి

రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు అనుకూలంగా అభివృద్ధికి దోహదం చేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బడ్జెట్‌పై మంత్రి మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు బడ్జెట్ శక్తి ఇస్తుందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే దిశగా బడ్జెట్‌లో కేటాయింపులు ఉన్నాయన్నారు.
News March 19, 2025
నిర్మల్ : పరీక్షలకు 367మంది విద్యార్థులు గైర్హాజరు

నిర్మల్ జిల్లాలోని 23 పరీక్ష కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 367మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈఓ పరుశురాం ప్రకటనలో తెలిపారు. మొత్తo 6416మంది విద్యార్థులకు పరీక్షకు కేటాయించగా ఇందులో 6049 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.