News December 28, 2025
HYD: మందు తాగారా..? స్వీట్ వార్నింగ్

మద్యం తాగి వాహనాలు నడిపితే జైలులో ఉంటారని CP సజ్జనార్ పదే పదే హెచ్చరిస్తోన్న సంగతి తెలిసిందే. కాసేపటి క్రితమే ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మియా.. డ్రింక్ కియా? తో స్టీరింగ్‌కు సలాం బోల్‌కే క్యాబ్ పక్డో’ అని CP సూచించారు. ‘Google cab.. not lawyer’ అంటూ దొరికితే వదలే ప్రసక్తే లేదని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అసలే వీకెండ్.. న్యూఇయర్ ఫీవర్ నడుస్తోందని మద్యం తాగి రోడ్డెక్కి చిక్కుల్లో పడకండి.
SHARE IT
Similar News
News December 28, 2025
తూ.గో: నది మింగిన నవ్వులు.. రోడ్డుపై రక్తపు మరకలు

ఉమ్మడి తూ.గో జిల్లాను 2025 ఏడాది వరుస ప్రమాదాలు ఉలిక్కిపడేలా చేశాయి. మేలో ముమ్మిడివరం వద్ద నదిలో స్నానానికి వెళ్లిన 8మంది యువకులు చనిపోగా, జూన్‌లో రంగంపేట సమీపాన జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. అక్టోబరులో రాయవరం బాణసంచాలో జరిగిన భారీ పేలుడు ఏడుగురిని బలితీసుకుని అంతులేని శోకాన్ని మిగిల్చింది. ఈ ఘటనలు అనేక కుటుంబాల్లో పుట్టెడు దుఃఖాన్ని నింపాయి.
News December 28, 2025
చిత్తూరు జిల్లాకు మరో 25,592 ఇళ్లు.!

PMAY పథకం కింద <<18682670>>చిత్తూరు<<>> జిల్లాకు 25,592 పక్కా గృహాలు అవసరమని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇందులో అత్యధికంగా పలమనేరుకు 9,651, కుప్పంకు 6,986, పుంగనూరుకు 2726, GD నెల్లూరుకు 2319, పూతలపట్టుకు 1905, నగరికి 1332, చిత్తూరుకు 671 పక్కా గృహాలు అవసరమని అధికారులు గుర్తించారు. ఈ అవసరాలకు అనుగుణంగా దశలవారీగా పక్కా గృహాలు మంజూరు చేయనున్నారు.
News December 28, 2025
ఈ ఏడాది 57 పోక్సో కేసులు నమోదు: VZM ఎస్పీ

విజయనగరం జిల్లాలో పోక్సో కేసులు గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా తగ్గినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. 2024లో 58 కేసులు నమోదుకాగా.. 2025లో 57 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ప్రాసిక్యూషన్ వేగవంతం చేయడంతో నిందితులకు కఠిన శిక్షలు ఖరారయ్యాయన్నారు. ఒక కేసులో యావజ్జీవ కారాగార శిక్ష, 2 కేసుల్లో 25 సంవత్సరాలకు పైగా, 11 కేసుల్లో 20 సంవత్సరాలకు పైగా జైలు శిక్షలు విధించబడ్డాయని వివరించారు.


