News November 7, 2024

HYD: మత్తువైపు మళ్లుతోన్న యువత..!

image

HYD సహా ఇతర జిల్లాల్లో గంజాయి, డ్రగ్స్ లాంటి అలవాట్ల వైపు యువత దారి మళ్లుతోంది. ఒక్క అక్టోబర్ నెలలోనే HYD జిల్లాలో దాదాపు 2167 కిలోలు, మేడ్చల్ జిల్లాలో 411 కిలోల గంజాయితో పాటు, హాష్ ఆయిల్, నీట్ ఆయిల్, నల్లమందు, MDMA తదితర మత్తు పదార్థాలు పట్టుబడ్డట్లుగా పోలీసులు తెలిపారు. తాజాగా వాటిని ప్రత్యేక పద్ధతుల్లో దహనం చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News November 12, 2025

HYD: డోర్లు మినహా.. మిగతా చోట్ల గ్రిల్స్ ఏర్పాటు!

image

ప్రమాదల నివారణకు మెట్రో మరో అడుగు ముందుకేసింది. అమీర్‌పేట ఎక్స్‌టెన్షన్ కావడంతో రద్దీ బీభత్సంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో L&T ఆధ్వర్యంలో ప్లాట్ ఫాం వద్ద స్పెషల్ డోర్లు కాకుండా, గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. మెట్రో డోర్ ఓపెన్ అయ్యే ప్రాంతాన్ని ఖాళీగా ఉంచి, మిగిలిన ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

News November 11, 2025

ప్చ్.. దేశంలోనే జూబ్లీహిల్స్ లాస్ట్!

image

ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోలింగ్ శాతంలో మన హైదరాబాద్‌ చివరి స్థానంలో ఉంటుంది. దేశవ్యాప్తంగా 8 నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరిగింది. మిజోరంలోని డంపా 82.34 శాతంతో పోలింగ్‌లో నం.1 స్థానంలో నిలిచింది. మన జూబ్లీహిల్స్ మాత్రం 48.43% ఓటింగ్‌తో చివరి స్థానానికి పడిపోయింది. సెన్సిటివ్ ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లోని బడ్గాం నియోజకవర్గంలో మన కంటే 2% ఎక్కువే నమోదైంది. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో ఏమో?

News November 11, 2025

జూబ్లీ పల్స్: ఎగ్జిట్ పోల్స్‌లో BJP డిపాజిట్ గల్లంతు!

image

జూబ్లీహిల్స్ ఎగ్జిట్‌ పోల్స్‌లో మెజార్టీ సర్వేలు INC వైపు మొగ్గు చూపాయి. 2వ స్థానంలో BRS నిలుస్తుందని అంచనా వేశాయి. ఇక కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటూ ప్రచారం చేసిన BJPకి కనీసం డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నాయి. కీలకమైన సర్వేల్లోనూ కమలం కనీసం 10శాతం ఓటింగ్ రాబడుతుందని చెప్పలేకపోయాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్‌ను SMలో పెడుతూ BJP కీలక నేతల మీద ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి.