News September 8, 2025
HYD: మత సామరస్యం చాటిన క్రిస్టియన్ యువకుడు

HYD కాప్రా(M) జవహర్‌నగర్‌లో నిన్న <<17640679>>ముస్లిం యువకుడు<<>> సోహెల్ వేలం పాటలో గణపతి లడ్డూ దక్కించుకుని మత సామరస్యం చాటగా నేడు క్రిస్టియన్ యువకుడు డేవిడ్ అదే బాటలో నడిచాడు. స్థానిక శ్రీరాంనగర్‌లో అడ్డా బాయ్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన గణనాథుడి లడ్డూను డేవిడ్ అనే క్రిస్టియన్ యువకుడు వేలం పాటలో రూ.40 వేలకు దక్కించుకున్నాడు. బొట్టు పెట్టుకుని, జై బోలో గణేశ్ మహారాజ్‌కీ జై అంటూ నినాదాలు చేశాడు.
Similar News
News September 10, 2025
BREAKING: కూకట్‌పల్లిలో మహిళ హత్య

HYD కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక స్వాన్ లేక్ అపార్ట్‌మెంట్‌లో రేణు అగర్వాల్ (50) అనే మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కూకట్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 10, 2025
పాక్ జాతీయుడిని స్వదేశానికి పంపిన హైదరాబాద్ పోలీసులు

చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించిన ఓ పాకిస్థాన్ జాతీయుడిని హైదరాబాద్ పోలీసులు స్వదేశానికి పంపించారు. మహ్మద్ ఉస్మాన్(48) అనే వ్యక్తి నేపాల్ మీదుగా 2011లో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. హైదరాబాద్‌లో నాలుగు క్రిమినల్ కేసుల్లో ఇతడు నిందితుడు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఇతడిని సెప్టెంబర్ 9న అటారీ సరిహద్దు వద్ద పాకిస్థాన్ రేంజర్స్‌కు అప్పగించారు.
News September 10, 2025
HYD: ‘తొలి భూ పోరాటానికి నాంది పలికిన చాకలి ఐలమ్మ’

తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత చాకలి ఐలమ్మ అని HYD జిల్లా అదనపు కలెక్టర్ కదిరవన్ పళని అన్నారు. బుధవారం చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని నాంపల్లిలోని కలెక్టరేట్‌లో BC సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ పళని, DRO వెంకటచారితో కలిసి కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.