News May 12, 2024

HYD: మధుయాష్కి గౌడ్ ఇంట్లో తనిఖీలు!

image

HYD పరిధి హయత్‌నగర్‌లో డబ్బులు పంచుతున్నారనే ఫిర్యాదు మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఈరోజు కాంగ్రెస్ నేత మధుయాష్కి గౌడ్ ఇంట్లో తనిఖీలు చేపడుతోంది. తనిఖీల్లో భాగంగా కాంగ్రెస్ నేత ఇంటి పరిసరాల్లో ఉన్న వారితో మాట్లాడి, డబ్బు పంపిణీపై ప్రత్యేక బృందం ఆరా తీసింది. రేపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, డబ్బు పంపిణీని అడ్డుకోవడం కోసం అధికారులు ఎక్కడికక్కడ నిఘా పెట్టారు.

Similar News

News October 8, 2024

HYD: ఆర్టిజన్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలి: కూనంనేని

image

తెలంగాణలో విద్యుత్‌ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్‌ కార్మికులు సుమారు 19వేల మంది చాలీచాలని జీతాలతో వెట్టిచాకిరి చేస్తూ కాలం వెల్లదీస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ సందర్భంగా నారాయణగూడలో ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ రంగ ఆర్టిజన్ కార్మికులనూ రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

News October 8, 2024

HYD: రాంగ్ సైడ్ డ్రైవింగ్.. 3 లక్షల కేసులు: ఎసీపీ

image

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత, అందుకు రహదారులపై విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఎసీపీ జి.శంకర్ రాజు అన్నారు. మలక్‌పేట్‌‌లోని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగులకు రోడ్డు ప్రమాదాలు, నివారణ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల 2024లో ఇప్పటి వరకు 3లక్షల కేసులయ్యాయన్నారు.

News October 8, 2024

HYDRAపై రేపు MLA KVR ప్రెస్‌మీట్

image

HYD సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో రేపు మ.12 గంటలకు కామారెడ్డి BJP MLA కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ‘హైడ్రా’ పనితీరు గురించి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటికే హైడ్రా పనితీరును కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. మరి KVR ఏం చెబుతారో ఉత్కంఠ నెలకొంది.